నూతన మార్కెట్ నిర్మాణాల తనిఖీ


Fri,November 8, 2019 03:40 AM

సిరిసిల్ల రూరల్: సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు కల్పించిన వసతులను, కోనుగోళ్లకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు. సెంటర్‌కు విచ్చేసిన రైతులతో మాట్లాడి సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు. అనంతరం సర్దాపూర్‌లో నిర్మిస్తున్న మార్కెట్‌ను పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మా ర్కెటింగ్ శాఖ అధికారి షాబొద్దీన్, ఏఏంసీ సిబ్బంది ఉన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...