కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి


Fri,November 8, 2019 03:39 AM

బోయినపల్లి: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేం ద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్‌ర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం కోరెం ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో అనంతపల్లి, దుండ్రపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు.

వర్షంతో ధాన్యం కొంత రంగు మారినప్పటికీ కొనుగోలు చేస్తామనీ, రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభు త్వం పనిచేస్తుందన్నారు. గత ప్రభుత్వాలు రైతుల గురించి ఎప్పుడైన పట్టించుకున్నాయా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ రైతుల శ్రేయస్సుకోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారన్నా రు. రైతుబందు, రైతుబీమా అమలుచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, కోరెం సింగిల్‌విండో చైర్మన్ తీపిరెడ్డి కిషన్‌రెడ్డి, వైస్ ఛైర్మన్ కోరెపు కొండ మల్లయ్య, అనంతపల్లి ఎంపీటీసీ కంకణాల వనజ, సర్పంచులు వంగపల్లి సత్యానారాయణ రెడ్డి, కరుణ, అనంతపల్లి ఉప సర్పంచ్ పర్శమల్లేశం, టీఆర్‌ఎస్ నాయకు లు కత్తెరపాక కొండయ్య, కంకణాల పురుషోత్తం రెడ్డి, గంగారెడ్డి, మాజీ సర్పంచ్ జాగిరి శోభన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...