కోనరావుపేట: ప్రభుత్వ పాఠశాలలకు దాతల సహకారం అభినందనీయమని సర్పంచ్ ఉప్పుల దేవలక్ష్మి, ఎంపీటీసీ కాశవేణి మమత అన్నారు. మండలంలోని సుద్దాల జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో గ్రామానికి చెందిన సుం కరి రవి, సుమలత దంపతులు విద్యార్థులకు టై, బెల్టులు, ఐడీకార్డులను అందించగా వాటిని పం పిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యనందించేందుకు కృషిచేయడం సంతోషకరమన్నా రు. విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నతస్థానాలకు చేరుకోవాలని సూచించారు. సహకరించిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానోపాధ్యాయులు దేవేందర్రా వు, రవీందర్, ఎస్ఎంసీ చైర్మన్లు ఎర్రవెల్లి విజయ్, మొండయ్య, వార్డు సభ్యుడు కాశవేణి మహేశ్ యాదవ్, నాయకులు శంకర్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.