రాజన్నకు విదేశీ కానుకలు


Thu,November 7, 2019 01:28 AM

-ఏడాదికి 5లక్షల నుంచి 10 లక్షల ఆదాయం
-హుండీ ద్వారా సమర్పిస్తున్న భక్తులు

వేములవాడ, నమస్తేతెలంగాణ: రాష్ట్రంలోని అతిపెద్ద శైవక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారికి విదేశీ నగదు కానుకలు కూడా భ క్తుల నుంచి సమకూరుతున్నాయి. యేడాదికి కోటిన్నరకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకొని తరిస్తున్న తరుణంలో ఈ ఆదాయం హుండీ ద్వా రా సమకూరుతున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కృష్ణవేణి వెల్లడించారు. వీదేశాల్లో స్థిరపడిన భక్తుల నుంచి స్వామివారికి ఇక సాలీనా 5 నుంచి 10లక్షల విదేశీ కరెన్సీ ఆదాయం స్వామివారి ఖజానాకు సమకూరుతోంది.

హుండీ ద్వారా మొక్కు చెల్లింపు
రాష్ట్రంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి కూడా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. కోరిన కోర్కెలు నెరవేరిన తరుణంలో రాజన్నకు అత్యంత ప్రీతిపాత్రమైన కోడెమొక్కు తరువాత హుండీ ద్వారా కానుకను సమర్పించే మొక్కు కూడా అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. ఇలా సాలీనా స్వామివారికి హుండీ ద్వారా భక్తులు సమర్పించిన మొక్కు ల ద్వారా నగదు ఆదాయం 12 నుంచి 15కోట్ల రూపాయల వరకు స్వామివారి ఖజానాకు సమకూరుతోంది. ఇందులో బంగారం, వెండితో పా టు నగదు, విదేశీ నగదు కానుకలు స్వామివారికి ముడుపుల రూపంలో చెల్లించుకుంటున్నారు.

ఉత్తర తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు..
ఉత్తరతెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్ళినవారి సంఖ్య వేలసంఖ్యలోనే ఉంటుంది. ఉపాధి తోపాటు ఇతర ఆదాయమార్గాలను ఎంచుకున్న అనేకమంది అరబ్ దేశాలకు ఈ ప్రాంతం నుంచి అధిక సంఖ్యలోనే వెళ్లి స్థిరపడిన వారు ఉన్నారు. దీంతో ప్రతి యేడాది లేదా రెండేళ్లకొకసారి వచ్చిన క్రమంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలోనే కొందరు భ క్తులు వీదేశి నగదును, కానుకలుగా స్వామివారికి హుండీలో సమర్పించుకుంటున్నారు. గడిచిన 10 సంవత్సరాల్లో కూడా అమెరికా, ఆస్ట్రేలియా, కెన డా, యూరప్ దేశాల్లో కూడా ఈ ప్రాంతం నుంచి అధిక సంఖ్యలోనే ఉన్నతచదువులు, ఉద్యోగాల్లో స్థిరపడిన వారి సంఖ్య కూడా పెరిగింది. దీంతో స్వామివారికి ఈ దేశాల నుంచి కూడా కరెన్సీ భారీగానే స్వామివారికి సమకూరుతుంది.

సాలీనా 10లక్షల దాకా విదేశీ ఆదాయం
ఇక రాజన్నకు భక్తులు హుండీ ద్వారా విదేశీ కరెన్సీని మొక్కుల రూపంలో చెల్లించుకుంటున్నారు. ఉద్యోగాలు, చదువులు లాంటి వ్యవహారాల్లో ఇతర దేశాలకు వెళ్లిన భక్తులు స్వామివారికి ఈ మొక్కులు చెల్లించుకున్నట్లుగా ఆలయ అధికారులు వెల్లడించారు. అయితే దుబాయ్, సౌదీ, ఒమన్, కువైట్ దేశాలకు చెందిన దరమ్స్, రియల్, దినార్‌లను హుండీ ద్వారా సమకూరుతున్నా యి. అమెరికా, లండన్, యూరప్ దేశాలకు చెంది న డాలర్స్, పౌండ్, వెల్లడించాయి.

ఐదేళ్లలో సమకూరిన ఆదాయం
గడిచిన ఐదు సంవత్సరాల్లో శ్రీరాజరాజేశ్వరస్వామివారికి హుండీ ద్వారా 36.02లక్షలు సమకూరినట్లు ఆలయ ఈవో దూస రాజేశ్వర్ వెల్లడించా రు. ఇందులో 2014-15లో 6.35లక్షలు, 20 15-16లో 9.49 లక్షలు, 2016-17లో 4. 89 లక్షలు, 2017-18లో 9.56లక్షలు, 2018-19లో 5.73లక్షల ఆదాయం స్వామివారికి హుం డీ ద్వారా విదేశీ నగదును భక్తులు సమర్పించుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ మాసం నాటికి దాదాపుగా 3.5లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయవర్గాలు వెల్లడించాయి.

విదేశాల్లో స్థిరపడిన భక్తులతో ఆదాయం
స్వామివారికి విదేశీ కరెన్సీ ఆదాయం హుండీ ద్వారా సమకూరుతోంది. ప్రతి హుండీ లెక్కింపులో నూ ఇతర దేశాలకు చెందిన నగదు సమకూరుతూనే ఉంది. సమకూరిన నగదును బ్యాం కుల ద్వారా స్వదేశీ నగదుగా మార్చుకుంటు న్నాం. గడిచిన ఐదేళ్లలో రూ.36లక్షలకు పైగా స్వా మివారికి ఈ విదేశీ కరెన్సీ ద్వారా సమకూరింది. విదేశాల్లో స్థిరపడిన భక్తుల నుంచి స్వామివారికి ఈ ఆదాయం సమకూరుతోంది.
-కృష్ణవేణి, రాజన్న ఆలయ కార్యనిర్వహణాధికారి

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...