యువత స్వయం ఉపాధితో ముందుకుసాగాలి


Thu,November 7, 2019 01:26 AM

రుద్రంగి: యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వయం ఉపాధితో ముందుకు సాగాలని రుద్రంగి కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ గుంటి సాయికుమార్ అన్నారు. బుధవారం రుద్రంగి మండల కేంద్రంలో శ్రీనివాస జువెల్లరీ షాపు ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జడ్పీటీసీ గట్ల మీనయ్యలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ సాయికుమార్ మాట్లాడుతూ నేటి యువత కొలువుల కోసం పరితపించకుండా స్వయం ఉపాధితో ముందుకు సాగాలన్నారు. యువతను ప్రోత్సహించేందుకు తమ బ్యాంక్ ఎల్లవేళలా అందుబాటు లో ఉంటుందన్నారు. పీఎంఈజీపీ కింద రుద్రంగికి చెందిన తుమ్మనపెల్లి శ్రీనివాస్‌కు రుణం మంజూరు కాగా తమ బ్యాంకు సహకారంతో ఆ రుణాన్ని అందించామన్నారు. నాయకులు గంగం మహేష్, మాడిశెట్టి ఆనందం, మంచె రాజేశం, తోకల తిరుమల్, చెప్యాల గణేష్, వెంగల కొమురయ్య, చెలుకల తిరుపతి, గడ్డం శ్రీనివాస్, ఎగ్యారపు మనోహర్, తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...