రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి


Thu,November 7, 2019 01:25 AM

కలెక్టరేట్: జిల్లాలోని పత్తి రైతులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారు లను కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మీటింగ్ హా లులో జేసీ యాస్మిన్‌బాషాతో కలిసి జిల్లాస్థాయి పత్తి కొనుగోలు కమిటీ సమావేశాన్ని బుధవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పత్తికి సంబంధించిన తేమ శాతం, మద్దతు ధరలను సలహా కేంద్రంలో ప్రదర్శించాలని, నిర్దిష్ట తేమ శాతం 8-12 లోపు ఉండాలని, ధ్రువీకరణ పత్రాలను అందించాలని సూచించారు. అ దేవిధంగా కౌలు రైతులకు కూడా ముందుగానే ధ్రువీకరణ పత్రాలు అందించాలని వివరించారు. జిన్నింగ్ మిల్లుల్లో కనీస మద్దతు ధర తో పాటు తేమ శాతం నిర్ధారణ సమాచారాన్ని అందుబాటులో ఉం చాలన్నారు. వే-బ్రిడ్జిలను, తూకపు మిషన్లను తనిఖీ చేయాలని లీ గల్ మెట్రాలజీ అధికారులను ఆదేశించారు. అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ అధికారులకు సూచించారు. జిన్నింగ్ మిల్లులకు మండల వ్యవసాయ విస్తరణ అధికారిని కేటాయించి డేటా ఎంట్రీ, ధ్రువీకరణ పత్రం జారీలో జాప్యం లేకుండా చూడాలని వివరించారు.

8న కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం..
సుద్దాల గ్రామంలోని కావేరీ కాటన్ మిల్లు, నాంపల్లిలోని లక్ష్మీనర్సింహ ఇండస్ట్రీస్, సంకెపల్లి గ్రామంలోని లక్ష్మి ఇండస్ట్రీస్‌లో పత్తి కొనుగోలుకు కేంద్రాలను ఏర్పాటు చేశామని, 8వ తేదీన జడ్పీ అ ధ్యక్షురాలు అరుణ ప్రారంభిస్తారని కలెక్టర్ వెల్లడించారు. జేసీ యాస్మిన్‌బాషా మాట్లాడుతూ పత్తి రైతులు దళారులను ఆశ్రయించవద్దని, జిన్నింగ్ మిల్లుల్లోనే విక్రయించాలని సూచించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనుగోళ్లు సా గుతాయని తెలిపారు. రైతులు సకాలంలో వచ్చి పత్తిని విక్రయించాలని సూచించారు. సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి షాబొద్దీన్, వ్యవసాయాధికారి రణధీర్‌రెడ్డి, డీఆర్డీవో కౌటిల్యరెడ్డి, పలువురు జిల్లా అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...