దళారులను నమ్మి మోసపోవద్దు


Thu,November 7, 2019 01:25 AM

వేములవాడ రూరల్: ప్రభుత్వం ఏర్పాటు చే యిస్తున్న కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని వి క్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ సూచించారు. వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి, నూకలమర్రి, ఫాజుల్‌నగర్‌తో పాటు వేములవాడ మార్కెట్ యార్డులో ప్రాథమిక స హకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డితో కలిపి ఆమె బుధవారం ప్రారంభించారు. అనంతరం జడ్పీ అధ్యక్షురాలు అరుణ మాట్లాడుతూ ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకవచ్చే సమయంలో తప్పక ఆరబెట్టాలని, తేమ 17శాతం ఉంటేనే ప్రభుత్వ మద్దతు ధర రూ1835 పొందే అవకాశం ఉంటుందని వివరించారు. ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు సహకారంతో లింగంపల్లి కొనుగోలు కేంద్రంలో రైతులకు అన్ని సౌకర్యాలూ కల్పిస్తామని, గోదాముల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని వివరించారు. ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఎవ రూ అధైర్యపడవద్దని హామీ ఇచ్చారు. రైతులు తమ వెంట పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కా ర్డు, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్ కాపీలను వెంట తీసుకురావాలని వివరించారు.

రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందనీ ఆమె గుర్తుచేశారు. రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలను ఉదహరించారు. టోకెన్ అధారంగా ధాన్యం కొనుగోళ్లు సాగుతున్నాయ ని, రైతులందరూ సహకరించాలని కోరారు. అన ంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీలు బండ మల్లేశం, బూర వజ్ర మ్మ, జడ్పీటీసీలు ఏశ వాణి, మ్యాకల రవి, స ర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఏశ తిరుపతి, ఊరడి రాంరెడ్డి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు గడ్డం హ న్మాండ్లు, ఊరడి ప్రవీణ్, పట్టణాధ్యక్షుడు పుల్కం రాజు, సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, డైరెక్టర్లు తూం కాంతారావు, గుడిసె సదానందం, బింగి మహేశ్, మహేందర్, సర్పంచ్‌లు సామ కవిత, పెండ్యాల తిరుపతి, ఎంపీటీసీలు మల్లారం తిరుపతి, శ్యామల, బొడ్డు శంకరవ్వ, నాయకులు ల క్ష్మణ్‌రావు, గొస్కుల రవి, వెంకటేశ్, ఈర్యానాయక్, దొంతుల అంజనీకుమార్, సోమినేని బాలు, సామ తిరుపతిరెడ్డి, మల్లారెడ్డి, రాములు, శంకర్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles