విద్యుత్ నియంత్రణ మండలి అధ్యక్షుడు


Thu,November 7, 2019 01:25 AM

-శ్రీరంగారావుకు శుభాకాంక్షలు
ముస్తాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్‌గా ఇటీవలే బాధ్యతలను స్వీకరించిన పోతుగల్ గ్రామానికి చెందిన తన్నీరు శ్రీరంగారావుకు ముస్తాబాద్ మండలానికి చెందిన పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లో ఆయనను ముస్తాబాద్ సహకార సంఘం చైర్మన్ చక్రధర్‌రెడ్డితో పాటు టీఆర్‌ఎస్ నాయకుడు తన్నీరు శ్రీనివాస్‌రావు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అంద జేసి శుభాకాంక్షాలు తెలిపారు. శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ మండలానికి చెందిన తన్నీరు శ్రీరంగారావును రాష్ట్ర ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్‌గా నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, అందుకు సహకరించిన మంత్రి కేటీఆర్, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌కు మండల ప్రజల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం పని చేసిన వారిని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తప్పక గుర్తిస్తారని వివరించారు. శ్రీరంగారావు హైకోర్టు న్యాయవాదిగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని గుర్తుచేశా రు. పట్టుదల, సమస్యల పరిష్కారంలో తనకంటూ గుర్తింపు పొందారని, ఆయనకు ఉన్నత పదవి అందించడం మండల ప్రజల అదృష్టమని అన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...