రెవెన్యూ నిరసన జ్వాల


Tue,November 5, 2019 03:15 AM

-తాసిల్దార్ సజీవదహనంపై జిల్లా ఉద్యోగుల ఆగ్రహం
-తాసిల్ ఆఫీసుల ఎదుట నిరసనలు
-కలెక్టరేట్ ఎదుట మౌన ప్రదర్శన
-నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్
-కలెక్టర్ కృష్ణభాస్కర్‌కు వినతిపత్రం అందజేత

సిరిసిల్ల టౌన్: అబ్దుల్లాపూర్‌మెట్ తాసీల్దార్ విజయారెడ్డి హత్యను జిల్లా ఉద్యోగుల సంఘం జేసీసీ నేతలు తీ వ్రంగా ఖండించారు. ఈ మేరకు కలెక్టరేట్ ఉద్యోగులు సో మవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయారెడ్డి హత్య హేయమని అభివర్ణించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశా రు. ఉద్యోగులకు భద్రత కల్పించాలని విజ్ఙప్తి చేశారు. తా సీల్దార్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అంజలి ఘటిం చారు. అనంతరం కలెక్టర్ కృష్ణభాస్కర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఈఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు జయంత్‌కుమార్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, విజయ్‌కుమార్, తాసీల్దార్లు గంగయ్య, ర వికాంత్, రమేశ్, సుమ, తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూ ఉద్యోగుల నివాళి
సిరిసిల్ల రూరల్: హత్యకు గురైన రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ తాసీల్దార్ విజయరెడ్డికి తంగళ్లపల్లి తాసీల్దార్ రాంరెడ్డి, సిబ్బంది నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తాసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందికి రక్షణ కల్పించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ అంతయ్య, ఆర్‌ఐ సంతోష్, వీఆర్వో లు, వీఆర్‌ఏలు, తదితరులు పాల్గొన్నారు.

విధుల బహిష్కరణ
ఎల్లారెడ్డిపేట: తాసిల్దారు విజయారెడ్డి హత్యకు నిరసనగా మండల రెవెన్యూ ఉద్యోగులు విధులను బహిష్కరించారు. హత్య సమాచారం తెలిసిన వెంటనే ఉద్యోగులు కా ర్యాలయం నుంచి బయటకు వచ్చారు. హత్యచేసిన దుం డగుడు సురేశ్‌ను కఠినంగా శిక్షించాలని నినదించారు. నిరసనలో రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.

రక్షణ కల్పించాలి..
ఇల్లంతకుంట: తాసీల్దార్ విజయరెడ్డి హత్యకు గురికావ డంపై మండల రెవెన్యూ ఉద్యోగులు విచారం వ్యక్తం చేశా రు. దుండగుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తాసీల్దార్ రాజిరెడ్డి, సిబ్బంది విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఉద్యోగులకు రక్షణ కల్పించాలని, అన్నివి ధాలా అండగా ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు.

నిందితుడిని శిక్షించాలి
వేములవాడ రూరల్: తాసిల్దార్ మునీందర్ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాసిల్దార్‌ను హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. నిందితుడిని ఊరితీయాలని డిమాండ్ చేశా రు. సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, కానీ హత్య చేయడమేమిటని ప్రశ్నించారు. వెంటనే నింది తుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తాసిల్దార్ హత్య హేయం
కోనరావుపేట: హైదరాబాద్ నగర శివారులోని అబ్దుల్లాపూర్‌లో తాసిల్దార్ విజయారెడ్డిని సజీవ దహనం చేయ డంపై మండల రెవెన్యూ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. తాసిల్ ఎదుట తాసిల్దార్ రమేశ్‌బాబు, రెవెన్యూ ఉద్యో గులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ పాశవికంగా తాసిల్దార్‌పై దాడి చేసి నిప్పటించడం విచారకరమన్నారు. ఘటనను తీవ్రంగా ఖండించా రు. నిరసన తెలిపిన వారిలో ఆర్‌ఐ రాంచంద్రం, వీఆర్వో లు, ఉద్యోగులు తదితరులున్నారు.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles