ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలి


Tue,November 5, 2019 03:13 AM

సిరిసిల్ల, నమస్తేతెలంగాణ: ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రా ధాన్యమివ్వాలని జిల్లా అధికారులను కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వ చ్చిన ప్రజల నుంచి జేసీ యాస్మిన్‌బాషా, డీఆర్వో ఖీమ్యానాయక్‌తో కలిసి కలెక్టర్ స్వయంగా అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయా దరఖాస్తులను సంబందిత శాఖలకు పంపి పరిష్కారానికి చొరవ చూపాలని ఆదేశించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సంబంధి త శాఖల అధికారులు చొరవ చూపాలని, ప్రజావాణి ఫిర్యాదులపై సత్వరమే స్పందించి పరిష్కారించాలని ఆదేశించారు.

సమస్యల పరిష్కా రం కోసం ప్రజలు మరోసారి కార్యాలయానికి రాకుండా చూడాలని, నిర్ణీ త కాల వ్యవధిలోనే వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచిం చారు. ప్రజల సమస్యలపై స్పందించి సత్వర పరిష్కారం చూపాల్సిన బా ధ్యత అధికారులదేనని అన్నారు. ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులు పాతవి మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. సోమవారం నాటి ప్రజావాణిలో మొత్తంగా 150 ఫిర్యాదులు రాగా, అం దులో డబుల్ బెడ్ రూంల కోసం 28, పింఛన్‌ల కోసం 61, రెవెన్యూ సం బంధిత సమస్యల పరిష్కారం కోరుతూ 61 వచ్చినట్లు అధికారులు తెలిపా రు. డయల్ యువర్ కలెక్టర్‌కు రెండు కాల్స్ వచ్చినట్లు వెల్లడించారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...