బయోమెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కమిటీ


Tue,November 5, 2019 03:13 AM

సిరిసిల్ల టౌన్: బయో మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ మానిటరింగ్ జిల్లా స్థాయి కమిటీని కలెక్టర్ కృష్ణభాస్కర్ సమక్షంలో నియమించినట్లు జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ ఒక ప్రకటనలో సోమవారం వెల్లడించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, తెలంగాణ స్టేట్ పొల్యూషన్ బోర్టు, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ 2016 నిబంధనల ప్రకారం 11మందితో కూడిన కమిటీని నియమించినట్లు తెలిపారు. కమిటీలో ఈఈటీఎస్‌ఎంఐడీసీ రవిదాస్, జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్ తిరుపతి, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఐఎంఏ రాధాకృష్ణ, వైద్యులు తాన రమేశ్, తిరుపతి, వెంకటరమణ, డీపీవో రవీందర్, కౌటిల్యరెడ్డి, రవీందర్‌రెడ్డి సభ్యులుగా ఉన్నారని వివరించా రు. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిర్వహణను నిర్లక్ష్యం చేసే వైద్యశాలల యాజమాన్యా లపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, హాస్పిటళ్లను సీజ్ చేయాలని కలెక్టర్ ఆదేశించినట్లు వెల్లడించారు. సదరు కమిటీ తనిఖీల నిర్వహించి నెలవారీగా కలెక్టర్‌కు నివేదికను అందజేస్తుందని స్పష్టం చేశారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...