11న సైన్స్ డ్రామా ఫెస్టివల్


Tue,November 5, 2019 03:13 AM

సిరిసిల్ల ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా ఉన్నత పాఠశాలల విద్యార్థులకు న వంబర్ 11న జిల్లాస్థాయి సైన్స్ డ్రామా ఫెస్టివల్ పోటీలను నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాధికారి రాధాకిషన్ ఒక ప్రకటనలో సోమవారం తెలిపారు. విజ్ఞాన శాస్త్రం-సమాజం ప్రధాన ఇతివృత్తంగా 11వ తేదీన సిరి సిల్ల శివనగర్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో పోటీలు ఉంటాయని వివరించా రు. 6నుంచి 10వ తరగతి విద్యార్థులే పోటీలకు అర్హులని తెలిపారు. గాంధీ శాస్త్ర విజ్ఞానశాస్త్రం, ఆరోగ్యం, పరిశుభ్రత, ఆవర్తన పట్టిక, పచ్చదనం, పరిశుభ్రత అనే అంశాలపైన సందేశాత్మకంగా డ్రామా స్కిప్టులు, సుమారు 30 నిమి షాల నిడివితో ఉండాలని సూచించారు. ప్రతి బృందంలో పది మంది మాత్ర మే ఉండాలని, ఉత్తమ చూపిన విద్యార్థులను ఉమ్మడి జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని వెల్లడించారు. మిగతా వివరాలకు జిల్లా సైన్స్ అధికారి ఆం జనేయులను 99485 39212 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles