ప్రజాదివస్ ఫిర్యాదులపై సత్వర చర్యలు: ఎస్పీ రాహుల్‌హెగ్డే


Tue,November 5, 2019 03:13 AM

సిరిసిల్ల క్రైం: ప్రజాదివస్ కార్యక్రమంలోని స్వీకరిస్తున్న ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ రాహుల్‌హెగ్డే వెల్లడించారు. జిల్లా పోలిసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురు బాధితుల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించారు. ఫిర్యాదు దారులతో ఓపికతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వెంటనే వాటి పరిష్కారా నికి చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సివిల్ సంబంధిత విషయాలను న్యాయస్థానంలో పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రజాదివస్‌ను ప్రతి సోమవారం ఉద యం 11 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. దీని ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం 12 ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో పోలిసు సిబ్బంది, ఫిర్యాదుదారులు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...