ఆయుర్వేద వైద్యంపై అవగాహన ఉండాలి


Tue,November 5, 2019 03:13 AM

సిరిసిల్ల ఎడ్యుకేషన్: విద్యార్థులందరికీ ఆయుర్వేద వై ద్యం ప్రాముఖ్యతపైన అవగాహన ఉండాలని జేసీ యా స్మిన్‌బాషా సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలిక పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆయుష్‌శాఖ నేతృత్వంలో ఆయుర్వేద వైద్య ప్రాముఖ్యత అనే అంశంపైన విద్యార్థులకు జిల్లాస్థాయి వ్యాసరచన పో టీలను సోమవారం నిర్వహించారు. అనంతరం నిర్వ హించిన బహుమతుల ప్రదానోత్సవంలో జేసీ పాల్గొని మాట్లాడారు. సంప్రదాయపు ఆహార అలవాట్లలోనే ఆయుర్వేద వైద్యం ఉందని వివరించారు. విద్యార్థులు దీనిని గమనంచాలని సూచించారు. ఆయుర్వేద వైద్యం తో దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయవచ్చని తెలిపా రు. అనంతరం విద్యార్థులకు బహుమతులను, ప్ర శం సాపత్రాలను అందజేసి అభింనందిచారు. కార్యక్రమం లో డీఈవో రాధాకిషన్, డాక్టర్ సదానందం, పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విజేతలు వీరే..
విద్యార్థులకు తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో పోటీలను నిర్వహించారు. తెలుగ విభాగంలో వేముల వాడ జడ్పీహెచ్ బాలికల పాఠశాలకు చెందిన రేవతి ప్ర థమ స్థానం, రుద్రవరం జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థిని విజ య ద్వితీయ, శివనగర్ బాలుర జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థి ని దీపికా తృతీయ, హిందీ విభాగంలో వేములవాడ జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థి రజాక్ ప్రథమ, శివనగర్ బాలు ర పాఠశాల విద్యార్థి లక్ష్మణ్ ద్వితీయ, ఆంగ్ల విభాగం లో శివనగర్ బాలరు జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థిని శరణ్య ప్రథమ, రుద్రవరం జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థిని హరిత ద్వితీయ, శివనగర్ జడ్పీహెచ్ బాలుర పాఠశాల విద్యార్థిని తృతీయ స్థానాల్లో నిలిచారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...