రాజన్న ఖజానాకు చెల్లని నోట్లు


Mon,November 4, 2019 02:16 AM

-హుండీ ద్వారా సమకూరుతున్న పాత నగదు
-మూడేళ్లు గడుస్తున్నా మారని తీరు
-ఇప్పటి వరకు సమకూరిన రూ.60.87 లక్షలు
-ఆందోళనలో ఆలయ అధికారులు

వేములవాడ, నమస్తే తెలంగాణ: వేములవాడ రాజన్నకు పాత నోట్ల చిక్కు తప్పడం లేదు. నల్ల డబ్బును వెలికితీసేందుకు మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది. రద్దు చేసిన నోట్లను మార్చుకునేందుకు బ్యాంకుల ద్వారా గడువు కల్పించినా భక్తులు హుండీల్లో వేస్తున్నారు. పేదల దేవుడు రాజన్నను దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రతియేటా కోటిన్నర మందికి పైగా భక్తు లు వస్తుంటారు. స్వామివారికి నగదు రూపంలోనూ భక్తులు నగదు, కానుకలు హుండీలో వేసి మొక్కులు చెల్లించుకునే సాంప్రదాయం ఉంది. యేడాదికి 17నుంచి 20 కోట్ల వరకు హుండీల ద్వారా స్వామవారి ఖజానాకు సమకూరడమే ఇందుకు నిదర్శనం. అయితే కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్‌లో పాత 1000, 500 రూపాయల నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. కానీ.. స్వామివారికి హుండీ ద్వారా భక్తుల నుంచి నేటి వరకు కూడా రద్దయిన పాత నోట్లు కానుకల ద్వారా లక్షలాది రూపాయలు సమకూరుతున్నాయి. ఆలయ అధికారులు సైతం వస్తున్న పాత నోట్లతో కంగు తింటున్నారు. ఇప్పటి వరకు స్వామివారి ఖజానాకు 60లక్షల87వేల500 రూపాయల వరకు పాతనోట్లు రాగా వాటిని అధికారుల సమక్షంలో విచారణ జరిపి స్వామివారి ఖజానాకు చేర్చుతున్నారు.

మూడేళ్లు గడుస్తున్నా మారని తీరు..
2016 నవంబర్‌లో పాత 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. నోట్లను రద్దు చేస్తూ వాటిని మార్చుకునేందుకు కూడా బ్యాంకుల ద్వారా అవకాశం కల్పించారు. నోట్లు రద్దయి మూడేళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటికి బయటకు వస్తూనే ఉన్నాయి. ప్రధానంగా రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయానికి వస్తున్న భక్తులు పాత నోట్లను హుండీలో మొక్కుల ద్వారా సమర్పించుకుంటున్నారు. 2017 జనవరి మాసం నుంచే బ్యాంకులు పాత నోట్లను స్వీకరించకపోవడంతో స్వామివారి ఖజానాకు మాత్రం నేటి వరకు హుండీల ద్వారా సమకూరుతుండడంతో ఆలయ అధికారులకు తలనొప్పిగా మారుతుంది.

60 లక్షల వరకు చేరిన పాతనోట్లు
రద్దయిన పాతనోట్లు స్వామివారి ఖజానాకు చేరుతున్నాయి. జనవరి 2017 నుంచా పాత నోట్లను స్వీకరించకపోవడంతో స్వామివారి ఖజానాకు ప్రతి లెక్కింపులో లక్షలాది రూపాయలు చేరిపోతున్నాయి. ప్రతి హుండీ లెక్కింపులోనూ దాదాపుగా 50వేల వరకు పాతనోట్లు ప్రత్యక్షమవుతున్నాయి. గడిచిన 2017 సంవత్సరం నాటికి40లక్షల వరకు అప్పటికే సమకూరాయి. ఇక 2019 అక్టోబర్‌లో జరిగిన హుండీ లెక్కింపు నాటికి 60లక్షల87వేల500 రూపాయలు పాతనోట్లు సమకూరినట్లు రాజన్న ఆలయ గణాంక విభాగం అధికారులు తెలిపారు. గడిచిన హుండీ లెక్కింపులోనూ 56వేల500ల రూపాయలు పాతనోట్లు వచ్చాయని వాపోయారు. నోట్లను మార్చేందుకు నాటి నుంచి నేటి వరకు అధికారులు ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. 2017 సంవత్సరంలోనే ఆలయానికి సమకూరిన మొత్తాన్ని ఆర్‌బీఐ అధికారులకు లేఖ ద్వారా వెల్లడించారు. అప్పటి వరకు 14లక్షలు మాత్రమే సమకూరగా విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా తాము తీసుకోబోమని లేఖ ద్వారా వెల్లడించినట్లు తెలిసింది. అయితే ప్రతి హుండీ లెక్కింపులోనూ స్వామివారికి వస్తున్న నగదును ఈవో కృష్ణవేణి కూడా ఆర్‌బిఐ అధికారులను సంప్రదించినప్పటికి ఫలితం మాత్రం కానరావడం లేదని తెలుస్తుంది.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles