వెలమ సంక్షేమానికి కృషి


Mon,November 4, 2019 02:13 AM

ముస్తాబాద్: వెలమ సంక్షేమ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఆల్ ఇండియా వెలమ సంక్షేమ సంఘం కోశాధికారి తన్నీరు బాపురావు అన్నారు. ఆదివారం తిరుపతిలో వెలమ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పలువురు సంఘం సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బాపురావు మాట్లాడుతూ, వెలమ సామాజికంలో కూడా వెనుకబడిన వారు ఉన్నారని పేర్కొన్నారు. వెనుకబడిన వారి విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఇప్పటికే పలువురు దాతల సహయంతో నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే కార్పొరేట్ వైద్యం అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలు వృద్ధాశ్రమాలతో పాటు విద్యార్థులకు వసతి గృహాలు కల్పిస్తున్నట్లు వివరించారు. అలాగే ఆల్ ఇండియా వెలుమ అసోసియేషన్ అధ్యక్షుడు భానుప్రకాశ్‌ను సీఎం కేసీఆర్ ప్రభుత్వ విప్‌గా నియమించడంతో హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వెలమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...