కల్యాణం.. కమనీయం


Mon,November 4, 2019 02:13 AM

సిరిసిల్ల రూరల్: తంగళ్లపల్లి మండలం చిన్నబోనాలలో శ్రీకృష్ణ, రుక్మిణీల కల్యాణోత్సవం కనులపండువలా జరిగింది. చిన్నబోనాలలోని శ్రీ కృష్ణ ఆలయంలో ఆదివారం వేడకలను వైభవంగా నిర్వహించారు. గ్రామంతోపాటు పరిసర గ్రామాల్లోని భక్తులు భారీగా హాజరై, కల్యాణోత్సవాన్ని తిలకించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కల్యాణోత్సవానికి రాష్ట్ర గొర్రెల, మేక ల అభివృద్ధి శాఖ ఫెడరేషన్ చైర్మన్ కన్నబోయిన రాజన్నయాదవ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయన్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిరిసిల్ల నియోజకవర్గానికి మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యంతో సిరిసిల్ల రూపురేఖలు మారాయనీ, చరిత్రాత్మకమైన అభివృద్ధి జరిగిందన్నారు. సీఎం కేసీఆర్‌తోనే గొల్లకుర్మలకు మంచి రోజులు వచ్చాయన్నారు. అనంతరం రాజన్నయాదవ్‌ను మండల యాదవ సంఘం నేతలు సత్కరించారు. ఇందులో ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ మల్లేశం యాదవ్, విజయ డెయిరీ జిల్లా అధ్యక్షుడు దడిగెల శ్రావణ్‌రావు, ఆర్‌ఎస్‌ఎస్ మండల కన్వీనర్ వొజ్జల అగ్గి రాములు, దేవేందర్ యాదవ్, మాజీ ఉప సర్పంచ్ రాములు, సంఘం అధ్యక్షుడు సలేంద్రి గురువయ్య, బోనాల దేవరాజు యాదవ్, వంగ రవీందర్ యాదవ్, నక్క సతీష్, యాదవ సంఘం సభ్యులు ఉన్నారు. సంఘం మండలాధ్యక్షుడు గోట్ల ఐలయ్య యాదవ్, బండి దేవేందర్ యాదవ్, నక్క సతీష్ పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...