దైవకార్యక్రమాలకు చేయూత అభినందనీయం


Mon,November 4, 2019 02:13 AM

ముస్తాబాద్: దైవకార్యక్రమాలకు చేయూతనివ్వడం అభినందనీయమ ని మాజీ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. మండలంలో ని పోతుగల్ గ్రామంలో సీఎం కేసీఆర్ సమీప బంధువు ప్రముఖ న్యాయవాది తన్నీరు మల్హర్‌రావు, శకుంతల దంపతులు వారి స్వగృహంలో ఆదివారం నిర్వహించిన శ్రీరామ క్రతువు హోమంలో రాష్ట్ర ఎలక్ట్రికల్ రెగ్యులేటర్ అథారిటీ చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు, మాజీ హోంశాఖమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్ అధ్యక్షుడు లక్ష్మీకాంతారావు పాల్గొన్నారు. సుమారు ఏడువందల సంవత్సరాల క్రి తం 10 ఎకరాల బల్లపరుపు బండపై నిర్మించిన శివకేశవ ఆలయాలు శిథిలావస్థకు చేరడంతో ఆలయాన్ని పునరుద్దరించాలని గ్రామస్తులు సంకల్పించారు. సుమారు రూ.3 కోట్ల అంచనాలతో శివకేశవ ఆలయ నిర్మాణం పూర్తికి ఆటంకాలు ఎదురుకాకూడదని శ్రీరామక్రతువు హోమం చేస్తున్నామ ని నిర్వాహకులు మల్హహర్‌రావు తెలిపారు. అనంతరం నిర్మాణం జరుగుతున్న ఆలయాన్ని మాజీ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పరిశీలించి మాట్లాడారు. గ్రామస్తుల సమష్టి కృషి, ఆలయ అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయమని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆల య అభివృద్ధికి రూ.50 లక్షలు ఇచ్చారని, ప్రజల సహకారంతో ఈప్రాంతానికి వన్నెతెచ్చే విధంగా శ్రీసీతారామాలయాన్ని నిర్మిస్తున్నామని ఆలయ నిర్వాహకులు వారికి తెలిపారు. ఈ ప్రాంతానికి వన్నె తెచ్చే విధంగా ఆలయ నిర్మాణానికి అంకితభావంతో పని చేస్తానని రాష్ట్ర ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు అన్నా రు. తన తండ్రి తన్నీరు గోపాల్‌రావు సుమారు 20 సంవత్సరాలు గ్రామ సర్పంచ్‌గా పనిచేశారని, అప్పటి నుంచే గ్రామం ప్రగతి బాటలో ఉందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తనపై నమ్మకంతో ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని చెప్పారు. ఆల యం పనులు పూర్తిచేసి ధూపదీప నైవేద్యంతోపా టు నిత్యపూజలు నిర్వహించేందుకు సహకారం అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్‌రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, టీఆర్‌ఎస్ రాష్ట్రనాయకులు వెన్నమనేని పూర్ణచందర్‌రావు, శ్రీనివాస్‌రావు, డాక్టర్ చంద్రశేఖర్‌రా వు, నాయకులు ద్వావతి పండరీ, ఏనుగు వేణు, పారిపెల్లి శ్రీనివాస్‌రావు, గీస శంకర్, చెక్కపల్లి రాజు, వెంకట్‌రావు, రాంమోహన్‌రావు, డాక్టర్ శంకర్‌రావు, శ్రీకాంత్‌రావు పాల్గొన్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...