మహాద్భుతం కాళేశ్వరం


Mon,October 21, 2019 04:36 AM

-రైతుల కలలను నెరవేర్చిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్
-జడ్పీ అధ్యక్షురాలు అరుణ
-జడ్పీటీసీలతో కలిసి బరాజ్‌లు, పంప్‌హౌస్‌ల సందర్శన
వేములవాడ, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ప్రా జెక్టు నిర్మాణం మహాద్భుతమని, తెలంగాణ రైతు ల కలలను సాకారం చేసిన అపర భగీరథుడు ము ఖ్యమంత్రి కేసీఆర్ అని జిల్లా పరిషత్ అధ్యక్షురా లు న్యాలకొండ అరుణ కొనియాడారు. నియోజకవర్గంలోని జడ్పీటీసీలు, సర్పంచ్‌లతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును ఆమె ఆదివారం సందర్శించా రు. ఈ సందర్భంగా లక్ష్మి (మేడిగడ్డ) పార్వతి (సుందిళ్ల), సరస్వతి (అన్నారం), గాయత్రీ (లక్ష్మీపూర్) తదితర బరాజ్‌లు, పంప్‌హౌస్‌లను పరిశీలించారు. ప్రాజెక్టు ప్రయోజనాలను, పనితీరును అక్కడి అధికారులు మ్యాప్ ద్వారా ప్రజాప్రతినిధులకు వివరించారు. అనంతరం జడ్పీ అధ్యక్షురాలు అరుణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతీ మాగాణికి సాగునీరందించే లక్ష్యాన్ని అనాది కాలంలోనే పూర్తిచేసి అబ్బురపరిచారని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గంగమ్మను ఎదురెక్కించేందుకు బిగించిన విద్యు త్ మోటర్లు పనితీరు ఆశ్చర్యకరమని సంతోషం వ్యక్తం చేశారు. నిరంతరం సాగు నీరందించేందు కు కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతుందని ఘంటాపథంగా తెలిపారు. గత ప్రభుత్వాలు ప్రాజెక్టుల నిర్మాణాలు ఏళ్లు గడిచినా పూర్తిచేయలేదని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం పాటుపడుతూ ప్రాజెక్టును నిర్మించడం గొప్ప పరిణామమని తెలిపారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ప్రాజెక్టును నిర్మించిన కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలంతా రుణపడి ఉంటారని వివరించారు. జడ్పీ అధ్యక్షురాలు వెంట వేములవాడ రూరల్ జడ్పీటీసీ ఏష వాణి, వేములవాడ అర్బన్ జడ్పీటీసీ మ్యాకల రవి, రుద్రంగి జడ్పీటీసీ గట్ల మీనయ్య, వేములవాడ రూరల్ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు ఏష తిరుపతియాదవ్, సర్పంచ్‌లు జైపాల్‌రెడ్డి, చంద్రయ్య, సోయినేని కరుణాకర్, సుమన్, కోనరావుపేట టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు న్యాలకొండ రాఘవరెడ్డి, నాయకులు దేవరాజు, షేక్ హుస్సేన్, సాంబ తిరుపతిరెడ్డి, తదితరులున్నారు.

119
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...