సిరిసిల్ల క్రైం: సిరిసిల్ల రూరల్ సీఐగా ఆదివారం ఎండీ సర్వర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు సిరిసిల్ల రూరల్ సీఐ అనిల్‌కుమార్ ఆదివారం రిలీవ్ కాగా, సర్వర్ బాధ్యతలను తీసుకున్నారు. సర్వర్‌కు శాలువా కప్పి సన్మానించారు. అంతకుముందు సిరిసిల్ల డీఎస్పీ వెంకటరమణను ఇటీవలే నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐలు వెంకటనర్సయ్య, లింగమూర్తి, సర్వర్ పుష్పగుచ్ఛం అంద జేసి మర్యాదపూర్వకంగా కలిశారు. వారి వెంట ఎస్ఐలు, సిబ్బంది ఉన్నారు.