రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో ఉమ్మడి జిల్లాకు రెండో స్థానం


Mon,October 21, 2019 04:34 AM

సిరిసిల్ల ఎడ్యుకేషన్: రాష్ట్రస్థాయి అండర్-14 యోగా పోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రెండో స్థానంలో నిలిచినట్లు జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ రవికుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి 65వ ఎస్జీఎఫ్ అండర్-14,17 యోగా పోటీలు మూ డు రోజుల పాటు నిర్వహించి నట్లు పేర్కొన్నారు. ఆదివారం నిర్వహించిన పోటీల్లో అండర్-14 విభాగంలో ఉమ్మడి జిల్లా విద్యార్థు లు ఉత్తమ ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానంలో నిలిచారని, మంత్రి హరీష్‌రావు చేతులమీదుగా వారు అవార్డులు అందుకున్నట్లు పేర్కొన్నారు.

జిల్లా విద్యార్థికి సిల్వర్ మెడల్..
జిల్లాలోని వెంకంపేట ప్ర భుత్వ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న గంగుల కార్తీక్ యోగా పోటీల్లో సత్తాచా టి సిల్వర్ మెడల్ సాధించాడు. కార్తీక్ రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలువడంపై డీఈవో రాధాకిషన్, ఎం ఈవో రఘుపతి, పాఠశాల హెచ్‌ఎం లక్ష్మణ్, పీ ఈటీ బాబు సంతోషం వ్యక్తం చేశారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...