క్రీడల్లోనూ రాణించాలి


Mon,October 21, 2019 04:34 AM

సిరిసిల్ల ఎడ్యుకేషన్: విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లోనూ రాణించాలని ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ రవికుమార్ సూచించారు. షటిల్ బ్యా ట్మింటన్ అండర్-14,17 విభాగంలో జిల్లాస్థయి క్రీడాకారుల ఎంపికకు పట్టణంలోని సిద్ధార్థ ఇంగ్లి ష్ మీడియం పాఠశాలలో ఆదివారం పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఈనెల 24న గోదావరిఖనిలో నిర్వహించనున్న ఉమ్మడి జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొనున్నారని వివరించారు. విద్యార్థులు క్రీడ ల్లో రాణిస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆటలతోనూ ఉజ్వల్ భవిష్యత్ ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు తడుక మోహన్, డా నియల్, జగన్, మదన్, సురేష్ పాల్గొన్నారు.

ఎంపికైన క్రీడాకారులు వీరే..
అండర్-17 బాలురు విభాగంలో.. విక్రమ్, అభిరామ్, వరుణ్, అభిషేక్, మనోహర్, బాలికల విభాగంలో శ్వేత, అనూష, హరిక, శివాని, వైష్ణవి, అండర్-14 బాలికల విభాగంలో సంకీర్తన, అశ్విత, ఉషశ్రీ, రోషిని ఎంపికైనట్లు వెల్లడించారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...