ఎలక్ట్రానిక్ జకార్డ్ యంత్రంతో నాణ్యమైన పట్టుచీరెలు


Mon,October 21, 2019 04:33 AM

సిరిసిల్ల రూరల్: సిరిసిల్ల బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేలా ఎలక్ట్రానిక్ జకార్డ్ యంత్రంతో నాణ్యమైన పట్టుచీరెలను తయారు చేయడం అద్భుతమని చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు, ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త వేముల మార్కండేయులు కొనియాడారు. మండలంలోని చంద్రంపేటకు చెందిన నేతకార్మికుడు కుసుమ నర్సింహస్వామి ఎలక్ట్రానిక్ జకార్డ్ యంత్రంతో నెల రోజులుగా నాణ్యమైన పట్టుచీరెలను తయారు చేస్తున్నారు. దీనిపై నమస్తేలో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నర్సింహస్వామిని సామాజిక సేవా కార్యకర్త మార్కండేయులు ఆదివారం కలిసి సన్మానించారు. అనంతరం ఖర్ఖానాలోని మరమగ్గంపై అమర్చిన జకార్డ్ యంత్రం పనీతీరు, చీరెల ఉత్పత్తి విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కండేయ మాట్లాడుతూ నర్సింహస్వామి అద్భుతమైన ఆవిష్కరణలు చేశారని కొనియాడారు. సిరిసిల్లలో మరిన్ని యంత్రాల ఏర్పాటుకు కృషి చేస్తామని, ఔత్సాహికులకు బ్యాంక్ ద్వారా రుణాలు అందించేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. చేనేతజౌళిశాఖ, టెక్స్‌టైల్ అధికారులకు యంత్రం వల్ల ఒనగూరే ప్రయోజనాలను వివరిస్తామని తెలిపారు. సిరిసిల్ల బ్రాండ్ ఇమేజ్ పెంచేందకు జుకార్డ్ యంత్రం ఎంతగానో దోహదపడుతుందన్నారు. త్వరలోనే మంత్రి కేటీఆర్‌ను ప్రాజెట్టు రిపోర్టుతో కలుస్తామని మార్కండేయులు ఈ సందర్భంగా వివరించారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...