బాహుబలి -3 సక్సెస్


Sun,October 20, 2019 04:36 AM

-మూడోపంపు వెట్‌ట్రయల్న్ విజయవంతం
-గంటపాటు నడిచిన మోటర్
-సంతోషం వ్యక్తం చేసిన అధికారులు
రామడుగు : మండలంలోని లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంప్‌హౌస్‌లో శనివారం నిర్వహించిన మూడోపంపు వెట్ ట్రయల్న్ విజయవంతమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా లక్ష్మీపూర్ గాయత్రి పంప్‌హౌస్‌లో మొత్తం ఏడు బాహుబలి పంపులను ఏర్పాటు చేయగా ఇప్పటికే 1,2,4,5,6 పంపులను అధికారులు వెట్ ట్రయల్ రన్ నిర్వహించారు. ఏడు పంపుల్లో ఐదు పంపులకు వెట్ ట్రయల్న్ నిర్వహించి ఒకవైపు మిడ్ మానేరుకు, మరో వైపు రివర్స్ పంపింగ్‌లో భాగంగా ఎస్సార్‌ఎస్పీకి నీటిని సరఫరా చేశారు. కాగా, మూడోపంపు వెట్ ట్రయల్న్ కోసం ధర్మారం మండలం నందిమేడారం ప్రాజెక్టు నుంచి గేట్లు ఎత్తి నీటిని వదలగా నేరుగా ఎనిమిదో ప్యాకేజీలోని గాయత్రి పంప్‌హౌస్ సర్జిఫూల్‌కు చేరుకొంది. పూర్తిస్థాయిలో నీటిశాతం చేరుకున్నాక మూడోపంపు వెట్ ట్రయల్న్ నిర్వహించారు. భూగర్భంలోని కంట్రోల్‌రూమ్‌లో రాష్ట్ర ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి మోటర్‌ను ప్రారంభించగా ప్రాజెక్టు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఈ శ్రీధర్ డెలివరీ సిస్టర్న్ వద్ద ఉండి పర్యవేక్షించారు. సాయంత్రం 6 గంటల వరకు మూడుసార్లు సైరన్ మోగించిన అధికారులు 6.20 గంటలకు మూడోపంపు వెట్ ట్రయల్న్ నిర్వహించారు. సుమారు గంటపాటు నడిపించి మోటర్‌ను ఆపేశారు. కాగా, మూడోమోటర్ వెట్ ట్రయల్న్ విజయవంతం కావడంతో ప్రాజెక్టు అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ ఏఈఈలు సురేశ్, శ్రీనివాస్, రమేశ్, ట్రాన్స్‌కో డీఈఈ దీకొండ భూమయ్య, మెగా ఏజన్సీ ప్రతినిధులు ఉన్నారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...