ఇంటింటికీ మిషన్ భగీరథ నీరందాలి


Sat,October 19, 2019 02:40 AM

-పది ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి
-పెండింగ్ అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలి
-జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణ
-ముగిసిన జడ్పీ స్థాయీ సంఘాల సమావేశం
-హాజరైన ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తేతెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ నీరు ఇంటింటికీ అందాలని, ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ అ ధ్యక్షురాలు న్యాలకొండ అరుణ ఆదేశించారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యులను కోరారు. జడ్పీ కార్యాలయంలో స్థాయీ సంఘాల సమావేశాలు రెండో రోజైన శుక్రవార మూ కొనసాగాయి. జడ్పీ అధ్యక్షురాలు అరుణ అధ్యక్షతన విద్య, వైద్యం, ప్రణాళిక అభివృద్ధి నిర్మాణపనులు, తంగళ్లపల్లి జడ్పీటీసీ పూర్మాణి మంజుల అధ్యక్షతన మహిళా సంక్షేమంపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జడ్పీ అధ్యక్షురాలు అరుణ మాట్లాడుతూ ఐటీ, మున్సిపల్‌పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు భగీరథ నీటి ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి చేపట్టిన మిషన్ భగీరథ పథకం నీటిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. భగీరథ నీరు మినరల్ వాటర్ కన్నా శుద్ధమైనవన్నారు. ప్రతి ఇంటికీ నీరు చేరేలా చూడాలన్నారు. కార్మిక, ధార్మిక క్షేత్రాల్లో ఎక్కువ శాతం మంది పేదలే ఉ న్నందున జిల్లా ప్రధాన వైద్యశాలలో మెరుగైన వైద్యం అందేలా చూ డాలని వైద్యులకు సూచించారు.

మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో సిరిసిల్ల ప్రధాన దవాఖానలో కిడ్నీ బాధితుల కోసం రూ. కోట్ల విలువ చేసే డయాలసిస్ పరికరాలను, వెంటి లేటర్ సౌకర్యం, బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేశారని కొనియాడారు. జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కిడ్నీ బాధితులు వస్తున్నారని, వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారని డాక్టర్లను ఆమె అభినందించారు. ముఖ్య మంత్రి కేసీఆర్ కిట్లతో ప్రసవాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందన్నారు. ప్రసవాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక గైనకాలజిస్టును ఇటీవలె నియమించిందని గుర్తుచేశారు. అందుకు ప్రత్యేక చొరవ చూపిన అమాత్యుడు కేటీఆర్‌కు జిల్లా ప్రజల పక్షాన ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పదో తరగతి పరీక్షలు దగ్గరపడుతున్నాయని, విద్యాశాఖ అధికారులు ప్ర త్యేక శ్రద్ధ దృష్టి సారించాలని, ఫలితాలలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను అరుణ ఆదేశించారు. కలెక్టరేట్, రైతుబజార్, వ్యవసాయ మార్కెట్ నిర్మాణ పనులను త్వరిత గతిన పూర్తయ్యేలా చూడాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేపట్టినా వంద శాతం సక్సెస్ చేసేందుకు సమష్టిగా కృషి చేద్దామని పిలుపుని చ్చారు. సమావేశంలో జడ్పీ వైస్‌చైర్మన్ సిద్ధం వేణు, ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, పూర్మాణి మంజుల, ముస్తాబాద్ జడ్పీటీసీ గుండం నర్సయ్య, వేములవాడ అర్బన్ జడ్పీటీసీ మ్యాకల రవి, వేములవాడ రూరల్ జడ్పీటీసీ ఏశవాణి, కో ఆప్షన్ సభ్యులు హైమద్, చాంద్‌పాషా, రుద్రంగి జడ్పీటీసీ గట్ల మీనయ్య, గంభీరావుపేట జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ, వీర్నపల్లి జడ్పీటీసీ కళావతి, బోయినిపల్లి జడ్పీటీసీ కత్తెరపాక ఉమ, చందుర్తి జడ్పీటీసీ నాగం కుమార్, జడ్పీసీఈవో గౌతంరెడ్డి, డిప్యూటీ సీఈవో నాగలక్ష్మి, డీఈ వో రాధాకిషన్, వైద్యాధికారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...