యువతకు ఉచిత శిక్షణ


Sat,October 19, 2019 02:38 AM

సుభాష్‌నగర్: భారత ప్రభుత్వ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ , నేషనల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (ఎన్‌ఐఎస్‌సీ) న్యూఢిల్లీ వారి సంయుక్త సహకారంతో, ఏపీఐటీసీవో ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలోని ఔత్సాహిక ఎస్సీ, ఎస్ట్సీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఏపీఐటీసీవో లి మిటెడ్ సీనియర్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ రాజిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వయం ఉపాధి, వ్యాపార నిర్వహణలో (ఎంట్రప్రెన్యూర్ షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్) 15 రోజులు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు రిపోర్ట్, మా ర్కెట్ సర్వే, మార్కెటింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, అకౌటింగ్, వివిధ పరిశ్రమల సందర్శన తదితర వ్యాపారాభివృద్ధి అంశాలపై అవగాహన కల్పిస్తా మని వివరించారు. శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్లతో పాటు, రవాణా భత్యం కింద రూ. 1500 చెల్లిస్తామని వెల్లడించారు.

18నుంచి 45 ఏళ్ల లోపు ఉండి, ఎస్‌ఎస్‌సీ చదివిన వారు అర్హుల ని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, రెండు పాస్‌ఫోర్టు సైజు ఫొటోలను తీసుకుని ఈనెల 22న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2గంటల లోగా కరీంనగర్ పద్మానగర్‌లోని పరిశ్రమల కేంద్రంలో నేరుగా హాజరుకావాలని స్పష్టం చేశారు. శిక్షణ ముగిసిన అభ్యర్థులకు రవాణా చార్జీల కింద రూ.1500లు చెల్లించనున్నట్లు తెలిపారు. వివరాలకు 98493 98587 సెల్ నంబర్‌లో సంప్రదించాలని ప్రాజెక్టు కో ఆర్డినేటర్ రాజిరెడ్డి ఆ ప్రకటనలో కోరారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...