సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి


Sat,October 19, 2019 02:37 AM

సిరిసిల్లటౌన్: జిల్లా వైద్యశాలలో సాధారణ ప్రసవాల సంఖ్యను మరింతగా పెంచేందుకు వైద్యులు కృషి చేయాలని కలెక్టర్ కృష్ణభాస్కర్ సూచించారు. జిల్లా హాస్పిటల్‌లో గైనకాలజిస్టుగా విధుల్లో చేరిన డాక్టర్ సౌమ్య కలెక్టర్‌కు మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు నియామక ఉత్తర్వులను అందజేసి అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ వై ద్యంపై ప్రజల్లో భరోసా పెంచాలని, ఆ విధంగా విధులను నిర్వహించాలని సూచించారు. పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, అత్యాధునిక పరికరాలను ప్రభుత్వ అందుబాటులోకి తెస్తున్నదని వివరించారు. కేసీఆర్ కిట్ పథకంతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. జిల్లా వైద్యశాలలో మరింత మంది గైనకాలజిస్టులను నియమిం చి సేవలు విస్తృతం చేస్తామని తెలిపారు. డాక్టర్ సౌమ్య జిల్లా వాస్తవ్యురాలు కావడం విశేషం. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్, జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్ తిరుపతి పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...