కొండూరికి ఘన సన్మానం


Sat,October 19, 2019 02:37 AM

గంభీరావుపేట: టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావును టీఆర్‌ఎస్ మండల నాయకులు ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ సహకార బ్యాంకుల డైరెక్టర్‌గా కొండూరి ఇటీవలె ఎన్నికైన విషయం తెలిసింది. ఈ సందర్భంగా రవీందర్‌రావును మండల నాయకులు హైదరాబాదులో కలసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 94దేశాల 1,100 ప్రతినిధుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు తరపున కొండూరి రవీందర్‌రావు పాల్గొనడమేగాక, అంతర్జాతీయ సహకార బ్యాంకుల డైరెక్టర్‌గా ఎన్నికకావడం గర్వకారణమని వారి హర్షం వ్యక్తం చేశారు. కొండూరిని కలిసిన వారిలో టీఆర్‌ఎస్ నేతలు కొమిరిశెట్టి లక్ష్మణ్, నాగపురి ఎల్లాగౌడ్, లింగంయాదవ్, రెడ్డిమల్ల రాజనర్సు, దోసల వికాస్ తదితరులున్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...