పోలీస్ అమరవీరుల సంస్మరణకే వారోత్సవాలు: ఎస్పీ


Sat,October 19, 2019 02:37 AM

సిరిసిల్లక్రైం: విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరులను సంస్మరణ కోసమే వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఎస్పీ రాహుల్‌హెగ్డే వివరించారు. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్‌హెగ్డే మాట్లాడు తూ పోలీస్ అమరుల త్యాగాలు వెలకట్టలేనివని కొనియాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు పాత్ర ఎనలేనిదని వివరించారు. మనం స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే అది పోలీస్ అమరవీరుల త్యాగ ఫలితమేనని, వారిని మనం గౌరవించాలని తెలిపారు. అనంతరం రక్తదానం చేసిన వారికి పండ్లు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ఆర్‌ఈ లు, 17వ పోలీస్ బెటాలియన్ అధికారులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...