ధాన్యం సేకరణలో జాగ్రత్తలు తీసుకోవాలి


Fri,October 18, 2019 02:47 AM

సిరిసిల్ల, నమస్తే తెలంగాణ: ధాన్యం సేకరణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా సంయుక్త పాలనాధికారి యాస్మిన్ బాషా అధికారులకు సూచించారు. గురువారం పొదుపు భవన్‌లో జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఖరీఫ్ ధాన్యం సేకరణ అంశంపై ఆయా మండలాల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేసీ యాస్మిన్ బాషా మాట్లాడుతూ రైతుల వద్ద నుంచి నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. జిల్లా అధికారులు మండలాల వారీగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని పేర్కొన్నారు. జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సరిపడా టార్పాలిన్‌లు, తేమశాతం కొలిచే యంత్రాలు, కాంటాలను సరాఫరా చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యవసాయాధికారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను క్లసర్ల వారీగా వ్యవసాయ అధికారులను, వ్యవసాయ విస్తీర్ణాధికారులను నియమించి నాణ్యతతో కూడిన ధాన్యం, సాగు వివరాలను సేకరించాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బాద్యులకు సూచనలు, సలహాలు అందజేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ ఇర్ఫాన్, జిల్లా మార్కెటింగ్ అధికారి శాబొద్దీన్, జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్ డీటీసీఎస్ ప్రవీణ్‌కుమార్ వహీద్దుద్దీన్‌తో పాటు టెక్నికల్ అధికారులు సందీప్‌కుమార్, గాఫరొద్దీన్‌లు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...