అమాత్యుడి ఆపన్నహస్తం


Fri,October 18, 2019 02:46 AM

సిరిసిల్ల టౌన్: అనారోగ్య సమస్యతో బాధపడుతున్న నిరుపేద దినసరి కూలీ వైద్యానికి మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అభయహస్తాన్ని అందించారు. జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్‌కు చెందిన పల్లపు కాశీరాంకు భార్య పద్మ, కొడుకులు సాయికుమార్, ఓంకార్, కూతురు భవానిలు ఉన్నారు. కాశీరాం దినసరి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కాగా కొద్దిరోజుల క్రితం కాశీరాం అనారోగ్యం బారినపడడంతో కుటుంబ సభ్యులు స్థానిక దవాఖానలో వైద్య పరీక్షలు చేయించారు. కరీంనగర్‌లో వైద్య పరీక్షల అనంతరం రెండు కిడ్నీలలో తీవ్ర సమస్య ఉన్నట్లు అక్కడి డాక్టర్లు తెలిపారు. హైదరాబాద్‌లోని దవాఖానలో వైద్యం చేయించుకోవాలని సూచించారు. ఖరీదైన వైద్యం చేయించుకొనలేక కాశీరాం ఇంటి వద్దే ఉంటూ మందులు తీసుకుంటున్నాడు. ఇటీవల ఆరోగ్యం మరింత క్షీణించడంతో స్థానిక మాజీ కౌన్సిలర్ బత్తుల వనజ కా శీరాం సమస్యను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కేటీఆర్ అధైర్యపడొద్దు అండగా తానుంటానని భరోసా కల్పించా రు. హైదరాబాద్ దవాఖానలో మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేయించారు. గురువారం కౌన్సిలర్ భర్త బత్తుల రమేశ్ బాధితుడికి ప్రయాణ ఖర్చుల కోసం రూ.5వేలు అందజేసి హైదరాబాద్‌కు పంపించారు. ఈ సందర్భంగా బాధితుడు కాశీరాం తన వైద్యం కోసం మంత్రి కేటీఆర్ స్పందించిన మంత్రి కేటీఆర్‌కు కాశీరాం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...