పశుపోషణతో రైతాంగానికి మేలు


Fri,October 18, 2019 02:45 AM

జగిత్యాల టౌన్ : వ్యవసాయంతో పాటు పశుపోషణతో రైతాంగానికి లాభాలు చేకూరుతాయని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ కేబీ సునితాదేవి పేర్కొన్నారు. గురువారం పొలాస వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ సేవా పథకంలో భాగంగా మూడో రోజూ వ్యవసాయ కళాశాల విద్యార్థులు జగిత్యాల మండలం లక్ష్మీపూర్ గ్రామం సందర్శించి అవగాహన కల్పించారు. క్షేత్ర సందర్శన, పురుగు మందుల వాడకంలో తీసుకోవాల్సిన జా గ్రత్తల గురించి గ్రామ రైతులకు వివరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ కేబీ సునితాదేవి మాట్లాడుతూ వ్యవసాయంతో పాటు పశుపోషణలో రైతాంగానికి లాభాలు చేకూరుతాయన్నారు.

జిల్లా వెటర్నరీ అధికారి జయకుమార్ మాట్లాడుతూ పశుపోషణలో పాల ఉత్పత్తి, గ్రుడ్లు, మాం సం ఉత్పత్తులను పెంచేందుకు రైతులు ముందుకు వచ్చి ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను ఉపయోగించుకోవాలన్నారు. పశువులలో వచ్చే వ్యా ధుల గురించీ, వాటి నివారణ చర్యలు, ఎక్కువ రోజులు పశుగ్రాసాన్ని నిల్వ ఉంచుకునే సైలేజ్ పద్ధతి, తయారు చేసే విధానం గురించి వివరించారు.

అనంతరం వ్యవసాయ కళాశాల అధ్యాపకులు ఎస్ శ్రీనివాస్ నాయక్, సంపత్ వ్యవసాయ విద్యార్థులతో గ్రామంలో క్షేత్ర సందర్శన నిర్వహించి పసుపు, అరటి, వరిలో వచ్చే చీడపీడలు, తెగుళ్లను గురించి వాటికి కావాల్సిన నివారణ చర్యల గురించి రైతులకు అవగాహన కల్పించారు. దీంతో పాటు రసాయానిక పురుగు మందుల పిచికారీ సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు, పు రుగులు పంటల్లో కలుగజేసే నష్టాల గురించీ, పు రుగులను గుర్తించే విధానాన్ని చిత్రపటం రూ పంలో రైతులకు వివరించారు. కార్యక్రమంలో డా క్టర్ అజారుద్దీన్, జాతీయ సేవా పథకం అధికారు లు డా.విజయలక్ష్మి, ఏ ఉమారాజశేఖర్, ఓ సంప త్, డీడీ కార్తీక్, శ్రీనివాస్‌నాయక్, శోభారాతోడ్, వ్యవసాయ విద్యార్థులు, రైతులున్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...