41 వైన్స్‌లు.. 648 దరఖాస్తులు


Thu,October 17, 2019 02:52 AM

-జిల్లాలో మద్యం దుకాణాలకు పోటాపోటీ
-నాన్ రిఫండ్ ఫీజు పెరిగినా తగ్గని వ్యాపారులు
-ఒక్క చివరి రోజే 399 దాఖలు
-అత్యధికంగా సిరిసిల్ల గెజిట్ నంబర్ 6కు 36..
-అత్యల్పంగా రుద్రంగి మండలం మానాల దుకాణానికి రెండు..
-88 టెండర్లు వేసిన మహిళలు
-ముగిసిన స్వీకరణ గడువు
-ఆబ్కారీకి 12.96 కోట్ల ఆదాయం
-రేపు సినారె కళామందిరంలో లక్కీ డ్రా
-ఏర్పాట్లలో యంత్రాగం

సిరిసిల్ల, నమస్తే తెలంగాణ: జిల్లా పరిధిలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణలో చివరి రోజు వ్యాపారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దరఖాస్తుదారులతో సినారె కళామందిరం జాతరను తలపించింది. మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో వైన్‌షాపులకు దరఖాస్తులు వేశారు. జిల్లాలోని మూడు ఎక్సైజ్ పరిధిలోని 41 మద్యం దుకాణాలకు 648 దరఖాస్తులు రాగా, ప్రభుత్వ ఖజానాకు 12.96కోట్ల ఆదా యం వచ్చింది. అందులో 88మంది మహిళలు దరఖాస్తు చేశారు. జిల్లాలో అత్యధికంగా సిరిసిల్లలోని గెజిట్ నంబర్ ఆరు దుకాణానికి 36దరఖాస్తులు రాగా, అత్యల్పంగా రుద్రంగి మండలం మానాలకు రెండు మాత్రమే వచ్చాయి. ఆఖరి రోజైన బుధవారం 399 దరఖాస్తులు వచ్చాయి. 9వ తేదీ నుంచి 249 దరఖాస్తులు రాగా చివరి రోజు 399 దరఖాస్తులు రావడం విశేషం.

సర్కిల్ వారీగా దరఖాస్తుల స్వీకరణ..
రెండేళ్ల కాల పరిమితికి (01-11-2019 నుంచి 30-10-2020) గాను ఈ నెల 3న కొత్త మద్యం దుకాణాలకు పాలసీని ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలోని 41 వైన్‌షాపులకు గెజిట్‌ను విడుదల చేశారు. కాగా జిల్లాలోని 13 మండలాల్లో 5 వేల లోపు జనాభా గలిగి 50 లక్షలు చెల్లించే మద్యం దుకాణాలు 13 ఉండగా 5 వేల నుంచి 50 వేల జనాభాతో 55 లక్షలు చెల్లించే దుకాణాలు 20ఉన్నాయి. లక్ష జనాభాతో 60 లక్షల లైసెన్స్ ఫీజులు చెల్లించే దుకాణాలు 8ఉన్నాయి. కాగా వీటిలో కొత్తగా వీర్నపల్లి దుకాణాన్ని 5వేల జనాభాతో 50లక్షలు చెల్లిం చే విధంగా కేటాయించారు. ఈ నెల 9 నుంచి బుధవారం వరకు సిరిసిల్ల కొత్త బస్టాండ్ ఎదురుగా గల సినారె కళామందిరంలో దరఖాస్తులను స్వీకరించారు. మూడు కౌంటర్లలో ఆబ్కారి శాఖ అధికారులు, సర్కిల్ కేంద్రాల వారీగా తీసుకున్నారు. దరఖాస్తులు ప్రారంభమైన రోజు 9న మూడు, 10న ఆరు, 11న 13 దరఖాస్తులు, 12న -16 రాగా . 13న ఆదివారం సెలవు రోజు దరఖాస్తులు స్వీకరించలేదు. 14న 90 దరఖాస్తులు, 15న 121 రాగా చివరి రోజు 16న 399 దరఖాస్తులు వచ్చాయి.

అత్యధికం -36.. అత్యల్పం - 2
జిల్లాలోని 41వైన్‌షాపుల్లో అత్యధికంగా గెజి ట్ నంబర్ సిరిసిల్ల పట్టణంలో (16,29, 30 వార్డుల సెక్టర్ ఫరిధిలోని) గెజిట్ నంబర్(6)కు 36 దరఖాస్తులు వచ్చాయి. సిండికేట్‌గా ఏర్పడిన వ్యాపారులు ఐదు నుంచి ఆరు వరకు దరఖాస్తు లు వేశారు. అత్యల్పంగా గెజిట్ నంబర్ రుద్రంగి మండలం మానాలకు రెండు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. కాగా రుద్రంగి మండలం మానాల దుకాణం విక్రయాలు తక్కువగా ఉండడంతో దరఖాస్తుదారు ఆసక్తి చూపలేదు.
మహిళలు 14 శాతం..
ఈ సారి మద్యం దుకాణాలకు 88మంది మహిళలు దరఖాస్తు చేశారు. 41దుకాణాలకుగాను వేములవాడ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 23 మంది మహిళలు, ఎల్లారెడ్డిపేట సర్కిల్ పరిధిలో 18 మంది, సిరిసిల్ల సర్కిల్ పరిధిలో 47 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. కాగా దాదా పు వచ్చిన దరఖాస్తుల్లో 14 శాతం మహిళలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

సడలించిన నిబంధనలు..
గత పాలసీలో లక్ష దరఖాస్తు రుసుం ఉండ గా ఈ సారి 2 లక్షలకు పెంచిన ప్రభుత్వం నిబంధనలను సడలించింది. ఈఎండీ (ధరావతు సొమ్ము) ఎత్తివేయడంతో వ్యాపారులు దరఖాస్తులు వేయడానికి ఆసక్తి చూపారు. గతంలో దరఖాస్తుకు నోటరీ సమర్పించాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం దరఖాస్తు ఫారం నింపి ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, 2 లక్షల డీడీ, లేదా చాలన్ జతచేయడం కూడా దరఖాస్తుదారులకు ఊరట లభించింది. దుకాణాలు పొందిన తర్వాత బ్యాం క్ గ్యారంటీని 65 నుంచి 50శాతం తగ్గించడం, పట్టణాల్లో క్లస్టర్ విధానాన్ని అమలు చేయ డం కూడా దరఖాస్తుదారులను ఆకర్శించింది.

చివరిరోజు వెల్లువలా దరఖాస్తులు..
దరఖాస్తులకు చివరిరోజైన బుధవారం దరఖాస్తులు వేయడానికి వ్యాపారులు బారులు తీరారు. సినారె కళామందిరం జాతరను తలపించింది. వ్యాపారులు రాత్రి ఎనిమిది వరకు దరఖాస్తులు సమర్పించారు. 9వ తేదీ నుంచి మంగళవారం వరకు జిల్లాలోని 41 దుకాణలకు 249 దరఖాస్తులు రాగా, చివరి రోజు 399 దరఖాస్తులు రావడం జిల్లాలోని కోదురుపాక, వెంకట్రావుపల్లి, మానాల మద్యం దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా వేయలేదు. సిరిసిల్ల ఎక్సైజ్ పరిధిలో 13 దుకాణాలకు 310 దరఖాస్తులు, ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ పరిధిలోని 11 వైన్ షాపులకు 173, వేములవాడ సర్కిల్ పరిధిలోని 14 వైన్స్‌లకు 165 దరఖాస్తులు స్వీకరించారు.

రెట్టింపు ఆదాయం
41దుకాణాలకు 648దరఖాస్తులు రాగా ప్రభుత్వ ఖజానాకు 12.96కోట్ల ఆదాయం వచ్చింది. 2017-19 ఎక్సైజ్ పాలసీలో లక్ష లైసెన్స్ ఫీజుతో స్వీకరించిన దరఖాస్తులతో 672 దరఖాస్తులతో ప్రభుత్వానికి 6.72కోట్లు ఆదా యం లభించింది. ప్రభుత్వం ఈ సారి 2 లక్షల దరఖాస్తు ఫీజు నిర్ణయించడంతో 648దరఖాస్తులు రాగా 12.96కోట్ల ఆదాయం వచ్చింది.

18న యజమానుల ఎంపిక..
మద్యం దుకాణాల దరఖాస్తు ప్రక్రియ బుధవారంతో ముగిసింది. కాగా జిల్లా కలెక్టర్ అధ్వర్యంలో ఈ నెల 18న సినారె కళామందిరంలో వైన్‌షాపు యజమానులను ఎంపిక చేయనున్నా రు. లైసెన్స్ ఫీజులో 12.5శాతం చెల్లించాలి. దాం తో పాటు 5లక్షలు ప్రభుత్వానికి పన్ను చెల్లించి మంజూరు పత్రాన్ని పొందాల్సి ఉంటుంది. కాగా అధికారులు దరఖాస్తులను బుధవారం రాత్రి పరిశీలించి క్రమపద్ధతిలో తయారుచేశారు. కేటాయించిన నంబర్ల ప్రకారం వ్యాపారులకు టోకెన్లు అందించారు. వీటిని ఎక్సైజ్ సర్కిల్ వారీగా బాక్స్‌లను సిద్ధం చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఈ నెల 18 సినారె కళామందిరంలో ఉదయం 11.30లకు కలెక్టర్ కృష్ణభాస్కర్ సమక్షంలో డ్రా తీసి లక్కీ విన్నర్లను ఎంపిక చేయనున్నారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...