ఆందోళన చెందవద్దు..


Thu,October 17, 2019 02:49 AM

బోయినపల్లి: మాన్వాడ నిర్వాసితులు ఆందోళ న చెందవద్దని పరిహారం చెల్లించేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉందని సిరిసిల్ల ఆర్డీవో శ్రీనివాసరావు అన్నారు. మాన్వాడ శ్రీ రాజరాజేశ్వర జలాశయం కట్ట వద్ద కొద్దిపాటి మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఈ తరుణంలో రెండోసారి బుధవారం పనులను అడ్డుకునేందుకు మాన్వాడ నిర్వాసితులు సిద్ధమై ఉదయమే పనుల వద్ద షామియానా వేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు షామియానా తీసి వేయించారు. పనులకు ఎటువంటి ఆటంకం కలుగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిర్వాసితులకు చెల్లించాల్సిన ప్రత్యేక ప్యాకేజీ చెల్లించాలని వారు పొలాల గట్లపై నుంచి వచ్చి ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న తాసిల్దార్ ధారప్రసాద్ అక్కడికి చేరుకుని నిర్వాసితులతో మాట్లాడి పరిహారం చెల్లిస్తామని అందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నదని చెప్పారు.

అయినా వారు వినకపోవడంతో తాసిల్దార్ సిరిసిల్ల ఆర్డీవో శ్రీనివాసరావుకు సమాచారం ఇవ్వగా వెంటనే ఆర్డీవో శ్రీనివాసరావు అక్కడికి చేరుకుని నిర్వాసితులతో మాట్లాడారు. నిర్వాసితుల పట్ల ప్రభుత్వం పూర్తి ఉదార స్వభావంతో ఉన్నదని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. 20 రోజుల్లో నిర్వాసితుల కుటుంబాల్లో అకౌంట్‌లో డబ్బు జమ అవుతుందని తెలిపారు. అందుకు సంబంధించిన ఫైలు ప్రభుత్వానికి పంపినట్లు పేర్కొన్నారు. దీంతో నిర్వాసితులు ఆందోళన విరమించారు. వేములవాడ రూరల్ ఇన్‌చార్జి చందు ర్తి సీఐ విజయ్‌కుమార్, వేములవాడ రూరల్ ఎస్‌ఐ రమేష్ నాయక్ స్థానిక ఏఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు. జలాశయం ఈఈ అశోక్‌కుమార్ ఉన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...