అనంతగిరికాలనీ పనులను పరిశీలించిన ట్రైనీ కలెక్టర్


Thu,October 17, 2019 02:49 AM

ఇల్లంతకుంట : మండలంలోని అనంతగిరి ఆర్‌అండ్‌ఆర్ కాలనీ పనులను బుధవారం ట్రైనీ కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ రాజిరెడ్డి మాట్లాడుతూ నేటి నుంచి 30 రోజుల పాటు ట్రైనీ కలెక్టర్ శిక్షణలో భాగంగా తాసిల్దార్ విధులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా అన్నపూర్ ప్రాజెక్టులో ముంపునకు గురైన అనంతగిరి గ్రామ ప్రజలకు నూతనంగా నిర్మిస్తున్న ఆర్‌అండ్‌ఆర్ కాలనీ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో రాజిరెడ్డితోపాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

రాజన్న సన్నిధిలో పూజలు
వేములవాడ కల్చరల్: వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారిని ట్రైనీ కలెక్టర్ బి.సత్యప్రసాద్ దర్శించుకున్నారు. ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఆలయ ప్రాంగణంలో ప్లాస్టిక్ సంచుల వినియోగంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీరివెంట ఆలయ పర్యవేక్షకులు కాం చనపెల్లి నటరాజ్,గోలి శ్రీనివాస్, పీఆర్వో ఉపాధ్యాయుల చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...