అమాత్యుడి ఔదార్యం


Thu,October 17, 2019 02:49 AM

ఎల్లారెడ్డిపేట: ఐటీ, మున్సిపాల్‌శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఓ యువకుడికి ప్రమాదంలో వెన్నెముక దెబ్బతినగా, ఆపరేషన్ నిమిత్తం అమాత్యులు కేటీఆర్ ఎల్‌వోసీ ఇప్పించి ఆదుకున్నారు. బుధవారం సదరు వివరాలను కుటుంబసభ్యులు విలేకరులకు తెలిపారు. గొల్లపల్లి గ్రామానికి చెందిన ద్యావ శ్రీకాంత్ అనే యువకుడు ఇటీవల ట్రాక్టర్ నడుపుతూ కిందపడిపోగా వెన్నెముక దెబ్బతిన్నది. హాస్పిటల్‌కు తీసుకువెళితే ఆపరేషన్ చేయా ల్సి ఉంటుందని వైద్యులు సూచించడంతో స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు కొండరమేశ్, తదితరులు సదరు విశయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన అమాత్యులు రూ.1.5లక్షలకు ఎల్‌వోసీ ఇప్పించి మరోమారు తన ఔదార్యాన్ని చాటుకున్నారు. దీంతో కుటుంబసభ్యులు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అందుకు సంబంధించిన ఎల్‌వోసీని బాధితుడు శ్రీకాంత్‌కు సర్పంచ్ పాశం సరోజన అందించారు. ఈ కార్యక్రమంలో పాశందేవరెడ్డి, కొండ ఆంజనేయులుగౌడ్, కో-ఆప్షన్ సభ్యులు మహ్మద్‌జబ్బార్, మనోహర్ తీగల ప్రకాశ్ ఉన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...