30న రెడ్డి ఆత్మీయ సమ్మేళనం


Tue,October 15, 2019 01:56 AM

సిరిసిల్ల రూరల్: జిల్లాలో నూతనంగా ఎన్నికైన రెడ్డి కుల ప్రజాప్రతినిధులకు 30న ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నామని జిల్లా అధ్యక్షుడు కనమేని చక్రధర్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు తంగళ్లపల్లి మండల కేంద్రంలోని రాజప్రపుల్ల రెడ్డి కల్యాణ మండపంలో సోమవారం ఆత్మీయ సమ్మేళన సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి విచ్చేసిన సెస్ చైర్మన్ దొర్నాల లకా్ష్మరెడ్డితో కలిసి ఆయన మాట్లాడుతూ ఈనెల 30న నిర్వహించే ఆత్మీయ సమ్మేళనానికి జిల్లాలోని రెడ్డి కుల బాంధవులు, రెడ్డి కుల ప్రజాప్రతినిధులు భారీగా తరలిరావాలన్నారు. సుమారు 5వేల మందితో తంగళ్లపల్లిలోనే ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో సెస్ చైర్మన్ దొర్నాల లకా్ష్మరెడ్డి, పుర్మాణి రాంలింగారెడ్డి, అంజిరెడ్డి, నేవూరి వెంకటరెడ్డి, న్యాలకొండ రాఘవరెడ్డి, పబ్బతి విజయేందర్‌రెడ్డి, నరేడ్ల రాఘవరెడ్డి,తిరుమల్‌రెడ్డి,రెపా అధ్యక్షుడు రంగారెడ్డి,వెంకటనర్సింహరెడ్డితోపాటు జిల్లాలోని అన్ని మండలాల రెడ్డి సం క్షేమ సంఘ నాయకులు, సభ్యులు ఉన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...