17 నుంచి జడ్పీ స్థాయీసంఘాల సమావేశాలు


Tue,October 15, 2019 01:56 AM

-జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ
సిరిసిల్ల , నమస్తే తెలంగాణ: ఈ నెల 17 నుంచి జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరు ణ ఒక ప్రకటనలో సోమవారం తెలిపారు. 17, 18వ తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించే ఈ సమావేశాలకు సంబంధిత పభుత్వ శాఖల జిల్లా అధికారులు సమగ్ర సమాచారం తో హాజరుకావాలని కోరారు. 17న వ్యవసాయ స్థాయీ కమిటీ సమావేశాన్ని ఉదయం 10.30లకు, గ్రామీణాభివృద్ధి శాఖ సమావేశాన్ని మధ్యాహ్నం ఒంటిగంటకు, సాంఘిక సంక్షేమ స్థాయి కమిటీ సమావేశాన్ని మూడు గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు. 18న విద్యా, వైద్యసేవల స్థాయీ కమిటీ సమావేశాన్ని 10.30 గంట లకు, మహిళా సంక్షేమ స్థాయీ కమిటీ సమావేశాన్ని మధ్యాహ్నం 12 గంటలకు, నిర్మాణపు పనుల స్థాయీ, ప్రణాళిక, అర్థిక పనుల స్థాయీల కమిటీ సమావేశాన్ని మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహించనున్నట్లు జడ్పీ అ ధ్యక్షురాలు అరుణ ఆ ప్రకటనలో వెల్లడించారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...