కన్న ఊరికి పెన్నిధవుదాం..


Tue,October 15, 2019 01:56 AM

వీర్నపల్లి: కన్న ఊరికి పెన్నిధవుదామని, స్వగ్రా మాల అభివృద్ధికి కృషి చేద్దామని ఎమిరెట్స్ తెలంగాణ సాం స్కృతిక, సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాధారపు సత్యం పిలుపునిచ్చారు. మండలంలోని అడవిపదిర గ్రామంలో సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు ఎడ్ల సాగర్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సన్మాన కార్యక్రమం లో ఆయన పాల్గొని మాట్లాడారు. 20 సంవత్సరాల క్రి తం గ్రామానికి రావాలంటే భయానక పరిస్థితి ఉండేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అనతికాలం లోనే గ్రామం అన్నిరంగాల్లో ప్రగతిని సాధించిందని తెలి పారు. ఇంకా అభివృద్ధి చేసుకుందామని, విడతల వారీగా పనులు పూర్తిచేద్దామని గ్రామస్తులకు సూచించారు. కుల, మత, పార్టీలకతీతంగా సామాజిక కార్యక్రమాలు నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. అనాథ, నిరుపేద విద్యార్థులకు అండగా ఉంటానని, అనారోగ్యంగా ఉన్న వృద్ధులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తానని హామీ చేశారు. వీర్నపల్లి, అడవిపదిర గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయిస్తానని ప్రకటించారు. ఆనంతరం జడ్పీటీసీ గుగులోత్ కళావతి మాట్లాడుతూ మారుముల ప్రాంతం నుంచి గల్ఫ్ వెళ్లిన సత్యం అక్కడే సొంతంగా కంపెనీలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించడం అభినందనీయమన్నారు. మండల అభివృద్ధికి చేయూతనందిస్తున్న ఆయనకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

జీపీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఘన సన్మానం
తొలుత గ్రామ స్వాగత ద్వారం(కమాన్) నిర్మాణ ప నులను సత్యం ప్రారంభించారు. 15 సిమెంట్ బెంచీలు, జీపీకి 55 కుర్చీలను వితరణ చేయగా, ఆయనను జీపీ పాలకవర్గం ఘనంగా సన్మానించింది. కా ర్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యులు ఉస్మాన్, సర్పంచ్‌లు దినకర్, ప్రమీల, లింగం, ఎంపీటీసీ అరుణ్, ఉపసర్పంచ్ కృష్ణ, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి, బంజార సంఘం జిల్లా అధ్యక్షుడు సురేశ్‌నాయక్, ఏఎస్‌ఐ వెంకటయ్య, నేతలు సంతోష్‌నాయక్, భాస్కర్, తిరుపతి, ఎన్. తిరుపతి, ఎల్.తిరుపతి, లచ్చయ్య, ప్రభాకర్, దేవరాజు, హన్మాండ్లు, రాజునాయక్, వార్డుసభ్యులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...