వాల్మీకి జీవితం ఆదర్శనీయం


Mon,October 14, 2019 01:35 AM

-జడ్పీ అధ్యక్షురాలు అరుణ
-ఘనంగా మహర్షి జయంతి వేడుకలు
-పాల్గొన్న కలెక్టర్ కృష్ణభాస్కర్

సిరిసిల్ల, నమస్తే తెలంగాణ: వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శనీయమని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ కొనియాడారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను సిరిసిల్ల పట్టణంలోని స్వశక్తి పోదుపు భవన్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కృష్ణభాస్కర్‌తో కలిసి జడ్పీ అధ్యక్షురాలు అరుణ కార్యక్రమానికి హాజరయ్యారు. వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో జడ్పీ అధ్య క్షురాలు మాట్లాడుతూ.. వాల్మీకి జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షనీయమ న్నారు. భారతీయ సంస్కృతి, జీవన విధానానికి ఎందరో మహనీయులు బాటలు వేశారని, అందులో వాల్మీకి పాత్ర ఎనలేనిదని కొనియాడారు. స్వతహాగా వేటగాడయినా సంకల్ప బలంతో శ్రీరామచంద్రుని చరిత్ర రాసే స్థాయికి ఆయన ఎదిగారని, 24 వేల శ్లోకాలను రచించి మహర్షి అయ్యారని గుర్తుచేశారు. యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

సంకల్పంతో ఏదైనా సాధించవచ్చు: కలెక్టర్ తొలుత కలెక్టర్ కృష్ణభాస్కర్ మాట్లాడుతూ ప్రతి మనిషీ తప్పులు చేయడం సహజమని, అయితే వాటిని తెలుసుకొని, సరిదిద్దుకొని స్వయంకృషితో ముందుకు సాగితే ఎ వరైనా మహర్షి కావచ్చని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి వాల్మీకి అని కొనియాడారు. వాల్మీకి జీవితాన్ని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మహాకావ్యమైన రా మాయాణాన్ని విరచితం చేసి తద్వారా మానవీయ విలువలు, రాజీనీతిని సమాజానికి ప్రబోధించారని వివరించా రు. కుటుంబ సంబంధాలు, విలువలతో కూడిన జీవన వి ధానం ఎలా ఉండాలో తెలిపారని కొనియాడారు. ఇండోనేషియాతో సహ ప్రపంచ దేశాలు రామాయాణం గోప్పదనాన్ని, వాల్మీకి సేవలను ఇప్పటికి గుర్తు చేసుకుంటున్నాయని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి మనిషీ తనలో తప్పులను తెలుసుకుని, విలువలతో కూడిన జీవన విధానాన్ని సాగిస్తే మహనీయులుగా ఎదుగుతారని, అం దుకు మహర్షి వాల్మీకి జీవితమే ఉదాహరణ అని వివరిం చారు. ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని నైతిక విలువలతో జీవనయానం సాగించాలని పిలుపునిచ్చారు. రా మాయణంతో ద్వారా కుటుంబ వ్యవస్థ పటిష్టతను చాటి చెప్పారని పేర్కొన్నారు.

వాల్మీకి స్ఫూర్తితో కొత్తగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా తోడ్పాటు అందించాలని కోరారు. అనంతరం వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి సువర్ణకిరీటి కలెక్టర్ కృష్ణభాస్కర్‌కు మట్టి శివుని ప్రతిమను బహూకరించారు. కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి దశరథం, స్త్రీ శిశుసంక్షేమ శాఖ రీజినల్ ఆర్గనైజర్ రేణ, డీఆర్డీవో రవీందర్, వాల్మీకి కమ్యూనిటీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...