అధిక చార్జీలపై రవాణా శాఖ చర్యలు


Mon,October 14, 2019 01:33 AM

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తేతెలంగాణ ఆర్టీసీ బస్సులలో అధిక చార్జీల వసూళ్లపై రవా ణా శాఖ చర్యలు ప్రారంభించింది. జిల్లా అధికారి ఆధ్వర్యంలో ముగ్గురు ఎంవీఐలతో స్పెషల్ స్కా డ్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆదివారం ఉద యం నుంచి సాయంత్రం వరకు జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు, అద్దెబస్సులతో పాటు అన్ని వా హనాలను ఈ బృందం తనిఖీ చేసింది. బస్సెక్కిన ప్రయాణీకుల నుంచి అధికారులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్మికుల సమ్మె నేపథ్యం లో ప్రభుత్వం చేపట్టిన ప్రత్యామ్నాయ చర్యలతో బస్సు చక్రాలు పరుగులు తీస్తున్నాయి. రద్దీకి అ నుగుణంగా బస్సుల సంఖ్యను పెంచి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles