సీనియర్స్ రెజ్లింగ్ ఎంపిక పోటీలు


Mon,October 14, 2019 01:32 AM

కరీంనగర్ స్పోర్ట్స్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి సీనియర్ రెజ్లింగ్ ఎంపిక పోటీలను ఈనెల 15న నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా అమోచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మల రమేశ్‌రెడ్డి, మహ్మద్ కరీంలు పేర్కొన్నారు. కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలలో పోటీలు సాగుతాయన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు పుట్టిన తేదీ, తెలంగాణ ఆధార్‌కార్డుతో హాజరుకావాలని సూచించారు. పురు షుల ఫ్రీ ైస్టెల్ విభాగంలో 57, 65, 74, 79, 86, 92, 97, 125 కేజీ ల్లో, గ్రీకో రోమన్ స్టయిల్ విభాగంలో 55, 60, 63, 6772, 77, 82, 87, 97, 130 కేజీల్లో, మహిళల విభాగంలో.. 50, 53, 55, 57, 59, 62, 65, 68, 72, 76 కేజీల్లో పోటీలు ఉంటాయని వెల్లడించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచే క్రీడాకారులను ఎంపిక చేసి ఈనెల 19, 20వ తేదీల్లో నిజామాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో పాల్గొంటారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...