ఏడో రోజూ.. ఉత్సాహంగా..!


Mon,October 14, 2019 01:31 AM

కరీంనగర్ స్పోర్ట్స్: నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో కొనసాగుతున్న ఆర్మీ ర్యాలీ ఆదివారం ఏడో రోజూ అదే ఉత్సాహంతో సాగింది. సోల్జర్ జనరల్ డ్యూటీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన 4342 మంది యువకులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో తెల్లవారుజామున 3.30 గంటలకు నిర్వహించిన ర్యాలీకి 3600 మంది యువకులు హాజరయ్యారు. ముం దుగా అభ్యర్థులకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను పరిశీలించి 1.6 మీటర్ల ప రుగు పందెం నిర్వహించారు. వీ టిలో అర్హత సాధించిన యువకులను ఇతర శారీరక పరీక్షలకు ఎంపిక చేశారు. ఈ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసి న అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను తని ఖీ చేశారు. సజావుగా ఉన్న అభ్యర్థులకు వైద్య పరీక్షల కోసం తేదీని కేటాయించారు. ఈ నెల 17 వరకు జరుగనున్న ఆర్మీ ర్యాలీలో సోల్జర్ టెక్నికల్, సోల్జర్ క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్, సోల్జర్ న ర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ ఫార్మా, సోల్జ ర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్స్‌మెన్ విభాగంలో ఎంపిక కోసం అర్హత పరీక్షలు నిర్వహిస్తున్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...