సిరిసిల్ల బతుకమ్మ చీరెకు బ్రాండ్ ఇమేజ్


Mon,October 14, 2019 01:31 AM

సిరిసిల్ల టౌన్: సిరిసిల్ల చేనేత చీరెలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్‌ను కల్పించేందుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక కృషి చేస్తున్నారని బ్రాండ్ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షురాలు, న్యూజిలాండ్ ఎన్‌ఆర్‌ఐ మహిళా ప్రతినిధి సునీతావిజయ్ కొనియాడారు. న్యూజిలాండ్‌లో ప్రవాస తెలంగాణ మహిళా కమిటీ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించగా, సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్లి హరిప్రసాద్ మరమగ్గంపై తయారు చేసిన బతుకమ్మ చీరెను అక్కడి ఎంపీ ప్రియాంక రాధాకృష్ణన్ ధరించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీతావిజయ్ మాట్లాడుతూ తెలంగాణలోని హస్తకళలు, చేనేత కళలను ప్రవాస భారతీయులకు పరిచయం చేసేందుకు కృషి చేస్తున్నా మన్నారు. సిరిసిల్లలో తయారవుతున్న బతుకమ్మ చీరెలకు విశ్వ వ్యా ప్తంగా ఆదరణ కల్పించేందుకు మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషిని కొనియాడారు. కార్యక్రమంలో న్యూజిలాండ్ ఎన్‌ఆర్‌ఐ ప్రతినిధులు పటోళ్ల నరేందర్‌రెడ్డి, కల్యాణ్‌రావు, విజయ్ కోస్నలు పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...