ఉమ్మడి జిల్లాలో 74 ఎస్టీటీ పోస్టులు


Sun,October 13, 2019 12:39 AM

కరీంనగర్‌ ఎడ్యుకేషన్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా 74 ఎస్జీటీ పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఖాళీలను గుర్తించగా, రాష్ట్ర ప్రభుత్వం టీఆర్టీ (టీచర్స్‌ రిక్రుట్‌మెంట్‌ టెస్ట్‌)-2017 ద్వారా నియామక ప్రక్రియ చేపట్టింది. ఈ మేరకు శుక్రవారం ఎస్జీటీ (తెలుగు మీడియం) తుది ఫలితాలను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. గతంలో 2012 డీఎస్సీ ద్వారా భర్తీ చేయగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2017 మార్చి, అక్టోబర్‌లో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2018 ఫిబ్రవరి 24న పరీక్షలు నిర్వహించి, 2018 జూన్‌ 25న మెరిట్‌ జాబితా ప్రకటించింది. అయితే, కోర్టు కేసుల కారణంగా ఎంపికను నిలిపేసింది. మరో వైపు ఈ విద్యా సంవత్సరం ఇబ్బంది లేకుండా విద్యా వలంటీర్లను నియమించింది. ఉపాధ్యాయ సంఘాలు, అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2017 ఉపాధ్యాయ నియామకాలను వేగవంతం చేస్తూ వచ్చింది. ఈ మేరకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రాతిపదికన ఖాళీలు భర్తీ చేసేందుకు 538 టీచర్ల నియామకాలకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఇందులో ఎస్‌ఏ 260 ఖాళీలను 2019 జూలై 13న అభ్యర్థులకు కౌన్సిలింగ్‌ నిర్వహించింది. ఈ మేరకు తెలుగు, ఉర్దూ, గణితం, జీవశాస్త్రం, భౌతికశాస్త్రం, సాంఘికశాస్త్రం ఉపాధ్యాయులు విధుల్లో చేరారు. 74 ఎస్జీటీల ఖాళీలను గుర్తించిన విద్యాశాఖ ప్రస్తుతం తెలుగు మీడియం ఎస్జీటీల భర్తీ కోసం శుక్రవారం తుది ఫలితాలను విడుదల చేసింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో తెలుగు మీడియం ఎస్జీటీల్లో 20 మంది ఎంపికయ్యారు. వీరు త్వరలో విధుల్లో చేరనున్నారు. ఇంగ్లిష్‌ మీడియం ఖాళీలు కూడా త్వరలోనే భర్తీ కానున్నాయి.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...