ఊరి మనవడిగా సేవచేస్తా..


Sun,October 13, 2019 12:38 AM

‘ఎల్లారెడ్డిపేట: ఊరి మనవడిగా తాతలు, ము త్తాతలు ఊరిలో పుట్టి, పెరిగిన పల్లె రుణం తీర్చుకునేలా సేవ చేస్తానని తెలంగాణ టూరిజం కల్చరల్‌ ఎండోమెంట్‌ యూత్‌ అండ్‌ మీడియా అఫై ర్స్‌ సలహాదారు కేవీ రమణాచారి తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌ను ఆయన శనివారం సందర్శించారు. తమ కుటుంబ సభ్యులందరి సొంత ఖర్చులతో నిర్మించ తలపెట్టిన క ల్యాణమండప పనులకు భూమి పూజ ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నారాయణపూర్‌లో ఆలయాల మరమ్మతుకు రూ.కోటి వ రకు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నాలుగు అదన పు తరగతి గదుల నిర్మాణానికి నిధులు మం జూరు చేయించి పనులు పూర్తి చేయించామని గుర్తుచేశారు. తన తండ్రితోపాటు మరో నలుగురు అన్నదమ్ముల్లో ఇద్దరు మృతిచెందగా, ఇంకా ముగ్గురికి 80ఏండ్ల పైనే వయసు ఉంటుందని, ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదని, ఊరిలో జన్మించినందుకు మరిన్ని సేవలు అందించాలని కోరుకుంటున్నామని తెలిపారు. అందులో భాగంగానే కారంచేటి తిరుమల కు టుంబీకులందరం కలిసి శివాలయం ఆవరణలో 15వందల చదరపు అడుగులతో రూ.30లక్షల నిర్మాణ వ్యయంతో కల్యాణ మండపాన్ని నిర్మిస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా కల్యాణ మండపానికి భూమిపూజ నిర్వహించి ఎదురుగా ఉన్న రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన ఆలయకమిటీ సమావేశంలో రమణాచారి అందిస్తున్న సేవలపై గ్రామస్తులు హర్షం వ్యక్తంచేశారు. ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఎ ల్లారెడ్డిపేటలోని పురాతన వేణుగోపాలస్వామి ఆ లయ మరమ్మతులకు సాయం అందించాలని గ్రా మస్తులు కోరగా అందుకు రమణాచారి సానుకూలంగా స్పందించారు. ఎల్లారెడ్డిపేట, నారాయణపూర్‌ గ్రామస్తులు రమణాచారిని ఘనంగా సన్మానించారు. తెవిరసం అధ్యక్షుడు వాసరవేణి పర్శరాములు తాను రాసిని ‘సిర్రగోనె’ పుస్తకాన్ని ర మణాచారి చేతులమీదుగా ఆవిష్కరింపజేశారు. కార్యక్రమంలో రమణాచారి సోదరుడు, నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రాజెక్టు డైరెక్టర్‌ కారంచేటి తిరుమల శ్రీనివాసులు, సర్పంచ్‌ లక్ష్మి, అంజాగౌడ్‌, మజీద్‌, లక్ష్మారెడ్డి, దొమ్మాట నర్సయ్య, గౌస్‌, తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...