‘ప్రణాళిక’ పనులు నిరంతరం నిర్వహించాలి


Sun,October 13, 2019 12:37 AM

కోనరావుపేట: ప్రజా భాగస్వామ్యంతోనే గ్రా మాల అభివృద్ధి సాధ్యమవుతుందని, పార్టీలు ఏ వైనా రాజకీయాలకు అతితంగా పల్లెలు ప్రగతి సాధించాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌రావు వివరించారు. కోనరావుపేట మండలంలోని స్వగ్రామమైన నాగారం లో కుమారుడు వికాస్‌, కోడలు దీపతో కలిసి ఆ యన శనివారం పర్యటించారు. తొలుత తన ఇం టి స్థలాన్ని పరిశీలించారు. అనంతరం శ్రీ కోదం డ రామస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో మొక్కను నాటారు. తదుపరి విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ పా ర్టీలు ఎన్ని ఉన్నా, వాటి ఎజెండా ఒక్కటేనని స్ప ష్టం చేశారు. ప్రతీ గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం ప్రణాళిక లాంటి కార్యక్రమాలను ని రంతరంగా నిర్వహించాలని కోరారు. అలాంటి కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములవ్వాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

సేంద్రియ సాగుపై దృష్టి సారించాలి..
రైతులు లాభాలతో పాటు ఆరోగ్యకర జీవితా న్ని గడపాలంటే సేంద్రియ సాగుపై దృష్టి సారించాలని సూచించారు. దానిపై గ్రామ రైతులకు అవగాహన కల్పించేందుకే ఈకో ప్యాక్టరీ ఫౌండేషన్‌ ద్వారా పూణె శ్రీ అనంద్‌ బోర్డియా సహ కారంతో సేంద్రియ విధానంలో గ్రామంలో తో టల పెంపకం చేపట్టామని తెలిపారు. రసాయని క ఎరువుల వినియోగాన్ని ఆపితేనే మానవ మనుగడ సాధ్యమవుతుందని, లేకుంటే భవిష్యత్‌ ఉండదని హెచ్చరించారు.

జిల్లాలో రెండో పెద్ద గ్రంథాలయం..
జిల్లాలో రెండో అతిపెద్ద గ్రంథాయలయాన్ని గ్రామంలో నిర్మిస్తున్నట్లు విద్యాసాగర్‌రావు వెల్ల డించారు. లైబ్రరీ పనులను పరిశీలించి పురోగతి ని ఆరా తీశారు. ఇప్పటికే నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేశామని తెలిపారు. గ్రామంలో జీ ఎంఆర్‌ వరలక్ష్మి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక యువతకు వృత్తి శిక్షణ ఇస్తున్నామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అ నంతరం శిక్షణ పొందుతున్న విద్యార్థులతో కలిసి మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. నర్సింగ్‌ శిక్ష ణ పూర్తి చేసుకున్న యువతులకు ధ్రువీకరణ ప త్రాలను అందజేశారు. అనంతరం పలువురు నా యకులు విద్యాసాగర్‌రావును ఘనంగా సన్మా నించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ లావణ్య, బీ జేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, మండ లాధ్యక్షులు సురేందర్‌రావు, రాష్ట్ర కిసాన్‌ మోర్చ ప్రధాన కార్యదర్శి పురుషోత్తమరావు, మాజీ సర్పంచ్‌లు గోపాడి జ్యోతి, తిరుపతిగౌడ్‌, బీజేవైఎం మండలాధ్యక్షుడు బాలజీ, నాయకులు మ హేశ్‌, వెలిచాల రవీందర్‌, గొట్టె రాంచంద్రం, వెం కటి, కోల కృష్ణస్వామి పాల్గొన్నారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...