విజ్ఞాన కేంద్రాలను వినియోగించుకోవాలి


Sun,October 13, 2019 12:37 AM

రుద్రంగి: గ్రామాల్లోని విజ్ఞాన కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని గు రుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. రుద్రంగిలో జ్ఞాన వి జ్ఞాన కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. అం తకుముందు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుళులర్పించారు. అనంతరం ఆ యన మాట్లాడుతూ గ్రామంలోని విజ్ఞానాన్ని పెంపొందించేందుకు విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇందులో అన్నిరకాల పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను దళిత సంఘం నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గట్ల మీనయ్య, గ్రామసర్పంచ్‌ తర్రె ప్రభలత, మనోహర్‌, కుల సంఘాల నాయకులు, ప్రజలు ఉన్నారు. ఆలాగే చందుర్తి మండలం లింగంపేటలో ప్రవీణ్‌కుమార్‌ కిరాణ దుకాణాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామానికి చెందిన దళిత సంఘం నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు శేఖర్‌, ఆనంద్‌, తదితరులున్నారు.

యువత చెడు వ్యసనాలకు అలవాటు పడవద్దు
బోయినపల్లి : యువత చెడు వ్యసనాలకు అలవాటు పడవద్దని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు. బోయినపల్లి మండలం దేశాయిపల్లికి చెం దిన దిలీప్‌ అనే యువకుడు విజయ పాల డెయిరీని కొదురుపాకలో ఏర్పాటు చేయగా శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ యువత మద్యం, ఇతర దురాలవాట్లకు అలవాటుపడితే భవిష్యత్‌ అంధకారమవుతుందన్నారు. స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని సూచించారు. నేటి యువత అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. లక్ష్య సాధనకోసం నిరంతరం శ్రమించాలన్నారు. ఉన్నతస్థానా లకు చేరుకునేందుకు కృషిచేయాలన్నారు. ప్రభుత్వం స్వయం ఉపాధికి ప్రోత్సాహం కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్‌, టీఆర్‌ఎస్‌ సీనీయర్‌ నాయకుడు కత్తెరపాక కొండయ్య, దేశాయిపల్లి సర్పంచ్‌ గోపాల్‌రెడ్డి, విజయ పాల డెయిరీ మేనేజర్‌ గోపాల్‌సింగ్‌, ఫిట్‌ ఇం డియా రాష్ట్ర అధ్యక్షుడు కన్నం మధు, ప్రధా న కార్యదర్శి ప్ర సన్న కుమార్‌, సలహాదారు సమ్మయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షడు కొంకటి శేఖర్‌, సీఆర్‌పీ బొడ్డు తిరుపతి ఉన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...