ఉత్సాహంగా.. ఉల్లాసంగా..


Sat,October 12, 2019 01:33 AM

కరీంనగర్ స్పోర్ట్స్: కరీంనగర్ జిల్లా కేంద్రంగా గత ఐదు రోజులుగా అంబేద్కర్ స్టేడియంలో జ రుగుతున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఉత్సాహం గా, ఉల్లాసంగా సాగుతోంది. సైనికులు కావాలనే లక్ష్యంతో అభ్యర్థులు కష్టాలను సైతం అధిగమించి ముందుకు పోతున్నారు. శుక్రవారం సోల్జర్ జనరల్ డ్యూటీ విభాగానికి ఆన్‌లైన్ ద్వారా 4251 మంది దరఖాస్తు చేసుకోగా సుమారు 3600 మంది యువకులు ర్యాలీలో పాల్గొన్నారు. సు మారు 550 మంది అభ్యర్థులు వైద్య పరీక్షలకు ఎంపికైనట్లు అధికారులు తెలిపారు. యువకులకు సంబంధించిన అడ్మిట్ కార్డులను పరిశీలించిన అ నంతరం స్టేడియంలోకి అనుమతించి 1.6 కిలోమీటర్ల పరుగుపందెంను నిర్వహించి వాటిలో నిర్ణీ త సమయానికి చేరుకున్న వారిని ఇతర శారీరక పరీక్షలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. వీటిలో ఎంపికైన సుమారు 550 అభ్యర్థులను వైద్య పరీక్షలకు అర్హత సాధించినట్లు రి క్రూట్‌మెంట్ అధికారులు చెప్పారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...