ఇదే స్ఫూర్తి కొనసాగాలి


Sat,October 12, 2019 01:33 AM

సిరిసిల్ల, నమస్తే తెలంగాణ: కొత్త జిల్లాగా ఏర్పాటు చేయడంతో సిరిసిల్ల అభివృద్ధి వేగవంతమైందని, ఇదే స్ఫూర్తిని కొనసాగాలని, మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశకత్వం, ప్రజల భాగస్వామ్యంతో రెట్టింపు అభివృద్ధిని సా ధించాలని కలెక్టర్ కృష్ణభాస్కర్ పిలుపుని చ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భవించి మూడేళ్లు పూర్తయి నాలుగో సంవత్సరంలో కి అడుగిడిన సందర్భాన్ని పురస్కరించుకుని పోదుపు భవన్ శుక్రవారం వేడుకలను ఘ నంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అధికారులు, జేసీ యాస్మిన్‌బాషాతో కలిసి కేక్ కట్ చేసి, అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఏర్పాటు సమయంలో జరిగి న సంఘటనలు, మూడేళ్లలో సాధించిన ప్రగతి, తన అనుభవాలను అధికారులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా క లెక్టర్ కృష్ణభాస్కర్ మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం ఒకే దఫా రాష్ట్రంలో 21జిల్లాలను ఏర్పాటు చే యడం దేశ చరిత్రలో తొలిసారని కొనియాడారు. జిల్లా ఏర్పాటుకు ముందు సాయంత్రం ప్రభుత్వ కార్యదర్శి తనను రా జన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా నియమిస్తున్నట్లు తెలిపారని, మరుసటి రోజునే బాధ్యతలు చేపట్టాలని సూ చించారని గుర్తు చేసుకున్నారు. బాధ్యతలు చేపట్టడం, విధుల్లో నిమగ్నం కావడం చకా చకా జ రిగిపోయాయన్నారు. ప్రారంభంలో విధులు, బాధ్యతలను అర్థం చేసుకోవడానికి సమ యం పట్టిందని, మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశకత్వంలో, అధికారుల సహకారంతో దక్షిణ భారతంలోనే రెండో ఓడీఎఫ్ జిల్లాగా, రా ష్ట్రంలో తొలి జిల్లాగా ఖ్యాతి గడించామన్నా రు.

స్వచ్ఛ దర్పన్‌లో దేశంలోనే మొదటి జిల్లాగా నిలిచామని గుర్తుచేశారు. మిడ్‌మానేర్ డ్యాం నిర్మాణం, అనంతగిరి ప్రాజెక్ట్ భూసేకరణ, పట్టణంలో 10.9 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధి, సుందరీకరణ వంటి ఎన్నో పనులను విజయవంతంగా పూర్తిచేశామన్నారు. చిన్న జిల్లా కావడం వల్లే పర్యవేక్షణ సులభంగా మారిందని, ప్రజలకు వేగంగా ప్రభుత్వ ఫలాలు అందించగలిగామని వివరించారు. జిల్లా ఏర్పాటు నుంచి నేటి వరకు ప్రజాసేవకులుగా చాలా కార్యక్రమాలు నిర్వహించామని జేసీ యాస్మిన్‌బాషా అన్నారు. రానున్న రో జుల్లో ఇంకా చేయాల్సి ఉందన్నారు. వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన సిరిసిల్ల, మూడేళ్లలోనే అభివృద్ధికి చిరునామాగా మారిందని అభివర్ణించారు. ఓడీఎఫ్‌లో, భూ రికార్డుల నవీకరణలో జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని, బతుకమ్మ చీరెల ఆర్డర్లతో కార్మికులకు నిరంతరం ఉపాధి లభించిందని తెలిపా రు. సాగు నీటి సౌకర్యం పెరుగడంతో పంటల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, దిగుబడి పెరిగిందన్నారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సత్యప్రసాద్, డీఆర్వో ఖిమ్యానాయక్, ఆర్డీవో శ్రీనివాసరావు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...